News November 19, 2025
వ్యక్తిగత సమాచారం పోస్ట్ చేయవద్దు: వరంగల్ సీపీ

నేరగాళ్లు టెక్నాలజీని వాడుకొని నేరాలకు పాల్పడుతున్నారని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారం వరంగల్ మెడికల్ కళాశాలలో ఆయన మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వెబ్‌సైట్‌లలో వ్యక్తిగత సమాచారం, ఫొటోలను పోస్ట్ చేయవద్దని, ఆన్‌లైన్ ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపవద్దని ఆయన హెచ్చరించారు.
Similar News
News January 23, 2026
కడప జిల్లాలో VRO సస్పెండ్.!

చెన్నూరు మండలం రామనపల్లి<<18926711>> VRO<<>> వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వేణు గోపాల్‌పై అందిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా VROను సస్పెండ్ చేస్తూ గురువారం కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు.
News January 23, 2026
KNR: స్థానిక సంస్థల నుంచే ఉన్నత శిఖరాలకు..

ఉమ్మడి KNR జిల్లా నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్లుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పలువురు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. బండి సంజయ్, గంగుల కమలాకర్, రామగుండం మాజీ MLAలు సోమారపు సత్యనారయణ, కోరుకంటి చందర్, KNR మాజీ MLAలు చల్మెడ ఆనందరావు, జువ్వాడి చంద్రశేఖర్‌రావు, ఇందుర్తి మాజీ MLA బొమ్మ వెంకటేశ్వర్లు, మాజీ MLCలు సంతోష్ కుమార్, గోపాల్ రావు తదితరులు కార్పొరేటర్ల నుంచే తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.
News January 23, 2026
నేటి నుంచి తిరుపతిలో టోకెన్ల్ బంద్

తిరుమలలో ఈనెల 25న రథసప్తమి వేడుకలు చేయనున్నారు. ఈక్రమంలో మూడురోజులు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ఈనెల 23, 24, 25వ తేదీల్లో ఈ టికెట్లు జారీ చేయరు. తిరిగి 26వ తేదీన మరుసటి రోజు దర్శనానికి సంబంధించి టోకెన్లను ఇస్తారు. ఈ మేరకు ఆయా టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు.


