News November 19, 2025
వ్యక్తిగత సమాచారం పోస్ట్ చేయవద్దు: వరంగల్ సీపీ

నేరగాళ్లు టెక్నాలజీని వాడుకొని నేరాలకు పాల్పడుతున్నారని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారం వరంగల్ మెడికల్ కళాశాలలో ఆయన మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వెబ్‌సైట్‌లలో వ్యక్తిగత సమాచారం, ఫొటోలను పోస్ట్ చేయవద్దని, ఆన్‌లైన్ ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపవద్దని ఆయన హెచ్చరించారు.
Similar News
News January 21, 2026
ఉమ్మడి NZB జిల్లాలో పనిచేసిన అధికారులకు ఐఏఎస్ హోదా

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతంలో వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన 16 రెవెన్యూ అధికారులకు భారత పరిపాలనా సర్వీస్ హోదా దక్కింది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో అదనపు కలెక్టర్లుగా పనిచేసి, పాలనలో తమదైన ముద్ర వేసిన పి.చంద్రయ్య, బి.వెంకటేశ్వర్లు ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన ఎన్.ఖీమ్యా నాయక్ కూడా ఐఏఎస్ హోదాను దక్కించుకున్నారు.
News January 21, 2026
NRPT: పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలి: కలెక్టర్

గతేడాది కంటే ఈసారి పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల నైపుణ్యాలు పెంచేలా బోధన ఉండాలన్నారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిరంతర పర్యవేక్షణ ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.
News January 21, 2026
పిట్లం: రైతన్న రూటే సెపరేటు.. థార్‌పై గడ్డి మోపు!

సాధారణంగా విలాసవంతమైన ప్రయాణాలకు, హోదాకు చిహ్నంగా భావించే ‘మహీంద్రా థార్’ వాహనాన్ని ఆ రైతు మాత్రం తన వ్యవసాయ పనులకు వాడుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. పిట్లం రైతు, సొసైటీ మాజీ వైస్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి బుధవారం తన థార్ వాహనం వెనుక గడ్డి మోపును కట్టుకుని వెళ్తుండగా, పిట్లం అండర్ పాస్ బ్రిడ్జి వద్ద క్లిక్ మనిపించిన దృశ్యమిది.


