News November 19, 2025

వ్యక్తిగత సమాచారం పోస్ట్ చేయవద్దు: వరంగల్ సీపీ

image

నేరగాళ్లు టెక్నాలజీని వాడుకొని నేరాలకు పాల్పడుతున్నారని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారం వరంగల్ మెడికల్ కళాశాలలో ఆయన మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వెబ్‌సైట్‌లలో వ్యక్తిగత సమాచారం, ఫొటోలను పోస్ట్ చేయవద్దని, ఆన్‌లైన్ ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపవద్దని ఆయన హెచ్చరించారు.

Similar News

News January 17, 2026

MBNR: సమ్మక్క సారలమ్మ జాతర.. బుక్ చేసుకోండి

image

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన “సమ్మక్క సారలమ్మ జాతర” ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అమ్మవార్లకు బంగారం సమర్పిందాలనకునే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలని ఏర్పాటు చేసినట్లు మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ “Way2News” ప్రతినిధితో తెలిపారు.ప్రసాదం ప్యాకెట్ దేవతల ఫొటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ www.tgsrtclogistics.co.in వెబ్ సైట్‌లో బుక్ చేసుకోవాలన్నారు.

News January 17, 2026

మెదక్ మున్సిపాలిటీలు.. మహిళలకే పట్టం!

image

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మహిళా గర్జన వినిపించనుంది. ఛైర్‌పర్సన్ పీఠాలన్నీ మహిళలకే రిజర్వు కావడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. మెదక్ స్థానం బీసీ మహిళకు దక్కగా.. తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ స్థానాలు జనరల్ మహిళలకు కేటాయించారు. దీంతో ఆశావహుల సందడి మొదలైంది. వార్డుల వారీగా రిజర్వేషన్లను కూడా అధికారులు అధికారికంగా ప్రకటించారు.

News January 17, 2026

USలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారా? జాగ్రత్త!

image

అమెరికాలో ఇద్దరు భారత విద్యార్థులను ఇమిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) కస్టడీలోకి తీసుకుంది. మిన్నెసోటాలోని సెయింట్ లూయిస్ పార్క్‌లో ప్రముఖ భారతీయ రెస్టారెంట్‌లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ పని చేస్తున్న సిబ్బందిని ప్రశ్నించారు. F-1(స్టూడెంట్) వీసా నిబంధనలను ఉల్లంఘించి రెస్టారెంట్‌లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారనే కారణంతో ఇద్దరు ఇండియన్లను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.