News November 6, 2025

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

తెనాలి 1-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాజర్‌పేటలో వ్యభిచార గృహంపై గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ విజయ్ కుమార్ నేతృత్వంలో వెళ్లిన టాస్క్‌ఫోర్స్ బృందం వారి నుంచి రూ.500 నగదు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుంది. అసాంఘిక కార్యకలాపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.

Similar News

News January 19, 2026

బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

image

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

News January 19, 2026

నెల్లూరు: నేడు పాఠశాలలు ప్రారంభం

image

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో జిల్లావ్యాప్తంగా నేడు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే విద్యార్థులతో స్కూల్ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఉపాధ్యాయులు హాజరై తరగతులు నిర్వహించారు. సెలవుల తరువాత మళ్లీ చదువుల వాతావరణం నెలకొనడంతో విద్యార్థుల్లో ఉత్సాహం కనిపించింది. తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపుతూ హర్షం వ్యక్తం చేశారు.

News January 19, 2026

తిరుమలలో ఆ మూడు విగ్రహాలు ఎవరివో తెలుసా..!

image

తిరుమల శ్రీవారి ఆలయంలోని తిరుమలరాయ మండపంలో నమస్కారం చేస్తూ ముగ్గురు భక్తుల రాగి విగ్రహాలను ఎప్పుడైనా చూశారా. లాలాఖేమరాము (రాజా తోడరమల్లు), ఆయన తల్లి మాతా మోహనదేవి, భార్య పితాబీబీ. ఆర్కాట్ నవాబు సాదతుల్లాఖాన్ కొలువులో అతని ప్రతినిధిగా కర్నాటకను పర్యవేక్షించిన ప్రధానాధికారి, క్షత్రియవీరుడు తోడరమల్లు. 17వ శతాబ్దంలో మహమ్మదీయులు, ఆంగ్లేయుల నుంచి తిరుమల క్షేత్రాన్ని కాపాడారు.