News February 27, 2025
వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి అచ్చెన్న సమీక్ష

వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో గురువారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. శుక్రవారం జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ కేటాయింపుల కోసం ఉన్నతాధికారులతో పలు అంశాలపై మంత్రి చర్చించారు. విజయవాడలో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశమైన ఆయన పలు ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు.
Similar News
News February 28, 2025
శ్రీకాకుళంలో మార్చి 3న మెగా జాబ్ మేళా

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో మార్చి 3వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ వై పోలినాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న పది, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కల్పిస్తున్నామన్నారు. ఈ మేళాలో 12 సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారని స్పష్టం చేశారు.
News February 27, 2025
శ్రీకాకుళంలో 23.93 శాతం పోలింగ్ నమోదు

శ్రీకాకుళంలో జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు 23.93 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న ఓటింగ్ తీరును పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
News February 27, 2025
ఎచ్చెర్ల : ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

విజయనగరంలో ఎచ్చెర్లకు చెందిన విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేశ్ స్థానిక బొడ్డువారి జంక్షన్‌లో ఫ్రెండ్స్‌తో ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.