News January 19, 2025
వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇస్తాం: Dy.CM భట్టి

తెలంగాణలో ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ అమలవుతుందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ఎర్రుపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భట్టి మాట్లాడుతూ.. భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రూ.12వేలు అందజేస్తామని స్పష్టం చేశారు. గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వివరించారు.
Similar News
News February 15, 2025
ఖమ్మం: స్టేడియంలో అన్ని సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్

ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి స్టేడియంను సందర్శించారు. స్విమ్మింగ్ పూల్, షటిల్ బ్యాట్ స్కేటింగ్, వ్యాయామ కేందం, జిమ్నాస్టిక్ హాల్, వాలీబాల్ కోర్టును పరిశీలించారు. క్రీడాకారులకు పౌష్టికాహారం, ఫ్రూట్స్, స్పోర్ట్ షూ అవసరమైన క్రీడా సామగ్రిని అందించాలని కోరారు.
News February 15, 2025
KMM: ఎక్కడ చూసినా అదే చర్చ..!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
News February 15, 2025
ఖమ్మం జిల్లాలో రూ.598 కోట్ల పెండింగ్ కరెంట్ బిల్లులు

ఖమ్మం జిల్లాలో విద్యుత్తు బిల్లులు పేరుకుపోయాయి. విద్యుత్తుశాఖలో భారీ స్థాయిలో బకాయిలు పేరుకుపోయాయి. ప్రైవేట్, ప్రభుత్వశాఖల నుంచి మొత్తం రూ.598 కోట్ల బకాయిలున్నాయి. ఇంత మొత్తం బకాయిలు ఉండటంతో ఆ శాఖపై పెనుభారం పడుతోంది. సంబంధిత శాఖ బకాయిలను రికవరీ చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈ బకాయిల్లో సింహభాగం రూ.241 కోట్లు మిషన్ భగీరథవి ఉండటం గమనార్హం.