News January 16, 2025

శంకర్‌పల్లి: మరకత శివాలయానికి హంపి పీఠాధిపతి

image

శంకర్‌పల్లి మండలం చందిప్పలోని 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయానికి ఫిబ్రవరి 5న హంపి పీఠాధిపతి హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి మహాస్వామి రానున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Similar News

News February 13, 2025

పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్: మంత్రి

image

గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. HYD విశ్వనగరమని, పెట్టుబడులకు గమ్యస్థానమని అన్నారు. మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభించడం సంతోషంగా ఉందని, ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

News February 13, 2025

హుస్సేన్ సాగర్ స్కైవాక్‌కు లైన్ క్లియర్

image

HYDలోని హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కై వాక్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే HMDA ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) విధానంలో నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. హుస్సేన్ సాగర్ చరిత్రను దృష్టిలో పెట్టుకొని నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. స్కైవాక్‌తో పాటు సైకిల్ ట్రాక్‌ను కూడా ఇక్కడ నిర్మించనున్నారు.

News February 13, 2025

గౌలిదొడ్డి: JEEలో గౌలిదొడ్డి విద్యార్థుల ప్రభంజనం

image

RR జిల్లా గౌలిదొడ్డి గురుకుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులు JEE అడ్వాన్స్ పరీక్షలో ప్రభంజనం సృష్టించారు. 99.03 పర్సంటైల్ సాధించి మణిదీప్ అనే విద్యార్థి చరిత్ర సృష్టించాడు. మరోవైపు చరణ్ తేజ్, తేజస్విని, రామ్‌చరణ్, శ్రీనివాస్, భాను తేజ, నేహాలత, నిహారిక టాప్ ర్యాంకులు సాధించినట్లు రెసిడెన్షియల్ అధికారులు తెలిపారు. ఒకే పాఠశాల నుంచి ఇంత మంది టాప్ ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందన్నారు.

error: Content is protected !!