News February 18, 2025

శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డ విదేశీ కరెన్సీ

image

శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్‌ఎఫ్‌ అధికారులకు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతణ్ణి క్షుణ్ణంగా తనిఖీ చేయగా 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసరు. ప్రయాణికుడిని అమీర్‌ అహ్మద్‌గా గుర్తించి అదుపులోకి తీసుకొని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Similar News

News April 14, 2026

ఆదిలాబాద్: ఎండ దెబ్బకు ‘తల’ వంచని కాపరి

image

నింగి నుంచి నిప్పుల వర్షం కురుస్తుంటే.. తల దాచుకోవడానికి చెట్టు నీడ కూడా కరువవుతోంది. కానీ, ఈ పశువుల కాపరి మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఏకంగా హెల్మెట్‌నే రక్షణ కవచంగా మార్చుకున్నాడు. పశువులేమో తల దించుకుని నడుస్తుంటే, ఈ కాపరి మాత్రం హెల్మెట్ వేసి ‘మినీ స్పేస్ షిప్’ కమాండర్‌లా దర్జాగా వెళ్తున్నాడు. బుర్ర’ ఉన్నోడు ఏ ఎండకైనా గొడుగు పడతాడని స్థానికులు చమత్కరిస్తున్నారు. వినూత్నమేదైనా అది ప్రాణ రక్షణకే.

News April 14, 2026

అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

image

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్‌కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.

News April 14, 2026

ఆ విషయంలో వైభవ్ హ్యాపీగా లేడు: అసిస్టెంట్ కోచ్

image

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపడంపై RR అసిస్టెంట్ కోచ్ ట్రెవోర్ పెన్నీ స్పందించారు. ‘ఫెరీరా గాయంతో బాధపడుతుండటంతో ప్రారంభ మ్యాచుల్లో సూర్యవంశీని పూర్తిగా ఆడించాం. ఫెరీరా కోలుకోవడంతో జట్టులోకి తీసుకున్నాం. అందుకే వైభవ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు పంపుతున్నాం. అంతేతప్ప ఫీల్డింగ్ చేయట్లేదని కూర్చోపెట్టడం లేదు. ఈ విషయంలో అతడు సంతోషంగా లేడు’ అని తెలిపారు.