News August 29, 2024
శిక్షణ సమయంలోనే పోలీస్ చట్టాలపై పట్టు సాధించాలి: వరంగల్ సీపీ
వరంగల్ పోలీస్ కమిషనర్ మడికొండలోని పోలీస్ శిక్షణా కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ముందుగా ట్రైనీ కానిస్టేబుళ్లకు పోలీస్ చట్టాలను బోధించే తరగతి గదులను సందర్శించారు. శిక్షణ సమయంలోనే పోలీస్ చట్టాలపై పట్టు సాధించాలని సీపీ సూచించారు. బోధనకు సంబంధించి ప్రతి అంశంపై పట్టు ఉండాలని, తద్వారా విధులు నిర్వహించే సమయంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా అధిగమించవచ్చని తెలిపారు.
Similar News
News September 17, 2024
హనుమకొండ: జాతీయ జెండా ఎగురవేయనున్న కొండా సురేఖ
హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా మంగళవారం హాజరవుతున్నారు. నేడు ఉదయం 9:48 నిమిషాలకు అదాలత్ కూడలిలోని అమరవీరుల స్తూపానికి పూలతో అంజలి ఘటించి నివాళులు అర్పించనున్నారు. అనంతరం 10 గంటలకు హనుమకొండ కలెక్టరేట్‌కు చేరుకొని జాతీయ జెండా ఎగరవేస్తారు.
News September 17, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..
> MLG: వితంతు మహిళపై అత్యాచారం… బాధిత కుటుంబం నిరసన
> JN: నిమజ్జనంలో అపశ్రుతి..
> HNK: గంజాయి తరలిస్తుండగా.. అరెస్టు
> JN: సీత్యా తండాలో పీడీఎస్ బియ్యం పట్టివేత..
> MLG: ఆదివాసీ విద్యార్ధి సంఘం మాజీ అధ్యక్షుడు మృతి..
> MHBD: బ్రెయిన్ ట్యూమర్ తో యువతి మృతి..
> JN: డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన సదస్సు..
News September 16, 2024
ఖిల్లా వరంగల్ కోటకు మంత్రి పొంగులేటి
ఖిల్లా వరంగల్ కోటలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉదయం అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, వరంగల్ విద్యుత్ ఎస్ఈ మధుసూదన్ రావు, తాహశీల్దార్లు నాగేశ్వరరావు, ఇక్బాల్ పాల్గొన్నారు.