News December 15, 2025
శివంపేట: ఓట్ల కోసం బట్టలు ఉతుకుతూ ప్రచారం

శివంపేట మండలం అల్లీపూర్ గ్రామ 1వ వార్డులో వార్డు సభ్యురాలి భర్త చాకలి బాబు వినూత్నంగా ప్రచారం చేశారు. తన భార్య తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి మహిళలతో కలిసి బట్టలు ఉతుకుతూ, గ్రామంలోని సమస్యలపై చర్చిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ఈ వింత ప్రచారం అల్లీపూర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
Similar News
News January 19, 2026
మెదక్: పింఛన్ డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు

మెదక్ మండలం రాజ్‌పల్లిలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు తన పింఛన్ డబ్బులు, బంగారం ఇవ్వలేదన్న కోపంతో చాకలి రాములు తన కన్నతల్లి నరసమ్మను కట్టెతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై లింగం సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
News January 19, 2026
మెదక్: 267 పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం

జిల్లాలోని 267 పాఠశాలల్లో ఉపాధి హామీ పథకం కింద 388 టాయిలెట్లు మంజూరైనట్లు డీఈఓ విజయ తెలిపారు. ఒక్కో యూనిట్‌కు రూ. 2 లక్షలు కేటాయించామన్నారు. బాలురు, బాలికలకు ప్రత్యేకంగా నిర్మించే ఈ పనులను సర్పంచులతో సమన్వయం చేసుకుని వెంటనే ప్రారంభించాలని హెచ్‌ఎంలు, ఎంఈఓలను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
News January 19, 2026
‘మెదక్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలి’

మెదక్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలని జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు. మెదక్ జిల్లాని రాజన్న సిరిసిల్ల జోన్‌లో గత ప్రభుత్వం అనాలోచితంగా కలిపిందని పలువురు ఆరోపించారు. నిరుద్యోగులు గ్రేడ్-4 స్థాయి ఉద్యోగాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చార్మినార్ జోన్‌లో కలిపి ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరారు.


