News February 19, 2025
శివరాత్రికి రెడీ అవుతున్న వేములవాడ

వేములవాడ రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో మహాశివరాత్రి జాతర నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ పార్కింగ్ ప్రాంతంలో శివార్చన, ప్రత్యేక క్యూలైన్స్, ధర్మగుండం సమీపంలో అభివృద్ధి పనులు బుధవారం చేపట్టారు. పటిష్ట బందోబస్తు భద్రత నడుమ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులకు వేగంగా దర్శనమయ్యే విధంగా కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
Similar News
News March 28, 2025
మార్చి 28: చరిత్రలో ఈరోజు

1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణం
1904: తెలుగు సినీ నటుడు చిత్తూరు నాగయ్య జననం (ఫొటోలో)
1914: తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు జననం
1944: నేపథ్య గాయని బి.వసంత జననం
1948: సినీ దర్శకుడు ఐ.వి.శశి జననం
1954: నటి మూన్ మూన్ సేన్ జననం
1962: భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు కోరాడ రామకృష్ణయ్య మరణం
News March 28, 2025
బెల్లంపల్లి: రైలు పట్టాలపై వ్యక్తి మృతి

బెల్లంపల్లి పట్టణం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే శాఖ హెడ్ కానిస్టేబుల్ సురేశ్ గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సిర్పూర్ టౌన్ నుంచి భద్రాచలం వెళ్లే సింగరేణి ప్యాసింజర్ రైలుకింద పడి మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఎల్లో కలర్ రౌండ్ నెక్ టీ షర్ట్, గ్రీన్ కలర్ షార్ట్ ధరించి ఉన్నట్లు వెల్లడించారు.
News March 28, 2025
ASF: ‘అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి’

జాతీయ గ్రామీణ హామీ పథకం క్రింద జిల్లాలో చేపట్టిన సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనులు ఈ నెల 30లోగా పూర్తి చేసి ఎంబీ రికార్డులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు 4 రోజులు మిగిలి ఉన్నాయన్నారు.