News February 19, 2025
శివరాత్రి వేడుకలు విజయవంతం చేయాలి: అదనపు కలెక్టర్

మహాశివరాత్రి వేడుకలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ములుగు అదనపు కలెక్టర్ సంపత్ రావు ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో పోలీసులు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి 28 వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. భక్తుల సంఖ్య దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల కోసం అవసరమైన పందిర్లు ఏర్పాటు చేయాలని కోరారు.
Similar News
News March 28, 2025
జనగామలో ఓ సూపర్ మార్కెట్ కు జరిమానా

జనగామ పట్టణంలోని ఓ సూపర్ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 26న కాలం చెల్లిన సరుకులను విక్రయించిన నేపథ్యంలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. కాలం చెల్లిన సరుకులు విక్రయించినందుకు సూపర్ మార్కెట్‌కు రూ.10వేలు జరిమానా విధించారు. ఇలాంటి ఘటన పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
News March 28, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 28, 2025
మార్చి 28: చరిత్రలో ఈరోజు

1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణం
1904: తెలుగు సినీ నటుడు చిత్తూరు నాగయ్య జననం (ఫొటోలో)
1914: తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు జననం
1944: నేపథ్య గాయని బి.వసంత జననం
1948: సినీ దర్శకుడు ఐ.వి.శశి జననం
1954: నటి మూన్ మూన్ సేన్ జననం
1962: భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు కోరాడ రామకృష్ణయ్య మరణం