News February 19, 2025

శివాజీ జయంతి: హోరెత్తనున్న వికారాబాద్

image

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జయంతి నేడు. ఈ సందర్భంగా ఉత్సవాలకు వికారాబాద్ ముస్తాబైంది. తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్‌లో హిందూ ఏక్తా ర్యాలీలు నిర్వహించనున్నారు. శివాజీ మహారాజ్ భారీ విగ్రహాలను పట్టణాల్లో ఊరేగిస్తారు. గతంలో పూడూరు మండలంలో ఛత్రపతి విగ్రహాన్ని MLA రాజాసింగ్ ఆవిష్కరించారు. ఇక్కడా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. జై భవాని.. జై శివాజీ నినాదాలతో నేడు వికారాబాద్ హోరెత్తనుంది.

Similar News

News April 18, 2026

కామారెడ్డి: అప్పుల బాధతో మహిళ రైతు ఆత్మహత్య

image

కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో శుక్రవారం సాయంత్రం ఓ మహిళ రైతు తన పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు దోమకొండ మండలం చింతమాన్‌పల్లి గ్రామానికి చెందిన లింగవ్వగా గుర్తించారు. భర్త మరణం తర్వాత అప్పుల భారం భరించలేక పాల్పడినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

KPHBలో తృటిలో తప్పిన పెను ప్రమాదం!

image

KPHB మెట్రో పిల్లర్ నంబర్ A-834 వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు ఉండగా, అప్రమత్తతతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.