News December 2, 2025
శుభ సమయం (02-12-2025) మంగళవారం

✒ తిథి: శుక్ల ద్వాదశి మ.12.15 వరకు
✒ నక్షత్రం: అశ్విని సా.6.39 వరకు
✒ శుభ సమయాలు: సా.5.20-సా.6.20
✒ రాహుకాలం: మ.3.00-సా.4.30
✒ యమగండం: ఉ.9.00-ఉ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: మ.2.52-సా.4.22
✒ అమృత ఘడియలు: ఉ.11.49-మ.1.29
Similar News
News February 11, 2026
భారత్‌కు అనుకూలంగా ట్రేడ్ డీల్‌లో కండిషన్స్ మార్చిన US

భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌లో వైట్ హౌస్ కీలక సవరణలు చేసింది. గతంలో భారత్ $500 బిలియన్ల విలువైన వస్తువులను కచ్చితంగా కొనాలని (Commits) పేర్కొన్న అమెరికా ఇప్పుడు దాన్ని ‘కొనే ఆలోచనలో ఉంది’ (Intends) అన్నట్లుగా మార్చింది. అమెరికా పప్పుధాన్యాలపై భారత్ టారిఫ్ తగ్గిస్తుందన్న పాయింట్‌నూ తొలగించింది. ఇండియా డిజిటల్ ట్యాక్స్ తొలగిస్తుందన్న స్థానంలో.. ఈ విషయంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయని మార్చింది.
News February 11, 2026
ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎంతంటే?

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.270 తగ్గి రూ.1,58,510కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 తగ్గి రూ.1,45,300 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.3లక్షలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 11, 2026
పిల్లల్లో అధిక రక్తపోటు లక్షణాలు

ప్రస్తుతకాలంలో పిల్లలు, యుక్తవయస్సు వారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో BP ఉంటే తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వంశ చరిత్రలో BP ఉంటే పిల్లలకు ఆరేళ్లు దాటిన తర్వాత ఏడాదికోసారి BP చెక్ చేయడం మంచిది. జీవనశైలి మార్పులతో దీన్ని తగ్గించొచ్చని సూచిస్తున్నారు.


