News August 23, 2025
శేరిలింగంపల్లి ఎమ్మెల్యేకు నోటీసులు.. ఉత్కంఠ

పార్టీ ఫిరాయింపుల అంశంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. పార్టీ మారిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేపై 3 నెలల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై గాంధీ ఎలా స్పందిస్తారోనని ఉత్కంఠత నెలకొంది.
Similar News
News January 16, 2026
కనుమ రోజు ఏ దేవుడిని పూజించాలంటే?

కనుమ నాడు పశువుల దైవమైన కాటమరాజుని, సకల దేవతా స్వరూపమైన కామధేనువును భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు సూచిస్తున్నారు. పశుసంపదను చల్లగా చూడమని కోరుతూ ఊరి పొలిమేరల్లో మొక్కులు చెల్లిస్తారు. ఇలా చేస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్మకం. ఈ రోజున పశువులను అందంగా అలంకరించి, వాటికి దిష్టి తీసి ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తారు. పిండివంటల తర్వాత కనుమ నాటి మాంసాహార విందులతో పండుగ సందడి ముగుస్తుంది.
News January 16, 2026
20 శాతం పెరగనున్న డిఫెన్స్ బడ్జెట్!

2026-27 ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ బడ్జెట్‌ను 20% పెంచాలని భారత రక్షణ శాఖ కోరుతోంది. గత ఏడాది కేంద్రం రూ.6.81 లక్షల కోట్ల కేటాయించగా.. ఈసారి మరింత ఖర్చు అవసరమని పేర్కొంది. గత బడ్జెట్ తీరులను చూస్తే 20 శాతం పెంపు అంటే అతిగా ఆశ పడటమే అని విశ్లేషకులు అంటున్నారు. అయితే <<18845622>>ఆపరేషన్ సిందూర్<<>>తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్‌లో కేటాయింపులు పెరగాలని పలువురు భావిస్తున్నారు.
News January 16, 2026
కనుమ రోజు రథం ముగ్గు ఎందుకు వేయాలి?

కనుమ నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. మన దేహం ఓ రథమని, దానిని నడిపించేది ఆ పరమాత్ముడేనని ఈ ముగ్గు మనకు గుర్తు చేస్తుంది. మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని దేవుడ్ని ప్రార్థించేందుకు ఇదో సంకేతం. అలాగే ఈ ముగ్గు సంక్రాంతికి భూలోకానికి వచ్చిన బలిచక్రవర్తికి గౌరవపూర్వకంగా వీడ్కోలు పలికేందుకు కూడా వేస్తారు. ఒక ఇంటి రథం ముగ్గు తాడును మరో ఇంటి ముగ్గుతో కలపడం సామాజిక ఐక్యతకు, ప్రేమానురాగాలకు నిదర్శనం.


