News September 11, 2025

శ్రమకు సెల్యూట్.. ఆకాశమంత ఎత్తులో కూలీల కష్టం!

image

కూటి కోసం కోటి విద్యలు అన్న నానుడి తెలిసిందే. ప్రాణాలకు తెగించి పనిచేస్తూ పొట్ట నింపుకునే వారు ఎందరో ఉన్నారు. కష్టపడి పనిచేసే వారికి ఆ పని వెనుక ఉన్న శ్రమ తెలుసు. అయితే నంద్యాల జిల్లా గడివేముల మండలంలో 760 కేవీ విద్యుత్ లైన్ పనులు జరుగుతున్నాయి. కొంతమంది శ్రామికులు ఆకాశమంత ఎత్తులో విద్యుత్ వైర్ల పనులు చేస్తున్న దృశ్యాన్ని Way2News క్లిక్ మనిపించింది. ఈ చిత్రం శ్రమైక్య జీవన సౌందర్యానికి నిదర్శనం.

Similar News

News December 11, 2025

కడప: గాన కోకిల ఎం.ఎస్. సుబ్బలక్ష్మి వర్ధంతి

image

కడప జిల్లా వాసులు గాన కోకిల ఎం.ఎస్. సుబ్బలక్ష్మిని మరువలేరు. ఆమె గానం చేసిన వేంకటేశ్వర స్వామి సుప్రభాతం ప్రతి శనివారం ఉదయం కడప ఆల్ ఇండియా రేడియో స్టేషన్ నుంచి ప్రసారమవుతుంది. ఆమె పాటలు గుండెల్లో గుర్తుండిపోయాయని, ఆమె మన మధ్య లేకపోయినా, ఆమె గానం ఎప్పుడూ గుర్తుంటుందని కడప వాసులు గురువారం ఆమె వర్ధంతి సందర్భంగా స్మరించుకున్నారు.

News December 11, 2025

విశాఖలో రూ.307 కోట్లతో రోడ్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

image

విశాఖలో రూ.306.95 కోట్లతో 88.35 కి.మీ. మేర రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM)లో ఈ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం జోన్-2లోని కార్ షెడ్ -పీఎం పాలెం రోడ్డును పరిశీలించి కార్యాచరణ ప్రారంభించారు. రోడ్లను ఆధునిక వసతులు, పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

News December 11, 2025

కడప YVUలో ప్రవేశానికి దరఖాస్తులు

image

కడప YVU పరిధిలోని అనుబంధ కళాశాలల్లో నాలుగో సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వైవియూ డైరెక్టర్ డా. టి. లక్ష్మిప్రసాద్ తెలిపారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. మూడు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు నాలుగు సంవత్సరాల యు.జి కోర్సుకు అర్హులు. వివరాల కోసం www.yvu.edu.in ను సంప్రదించవచ్చు.