News March 31, 2024

శ్రీకాకుళంలో ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్

image

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేసినట్లు డీఈఓ వేంకటేశ్వరరావు తెలిపారు. పలాస మండలం పెద్దంచల గ్రామానికి చెందిన టీచర్ బెహరా మాధవరావు రాజకీయ పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదుతో విచారణ చేపట్టిన అధికారులు ధ్రువీకరించారు. సారవకోట మండలం మొగుపురం గ్రామానికి చెందిన టీచర్ చౌదరి లక్ష్మీనారాయణ వాట్సాప్‌లో ప్రచారం చేసినట్లు ఎంఈఓ ధ్రువీకరించి ఇద్దరిని సస్పెండ్ చేశారు.

Similar News

News February 10, 2026

శ్రీకాకుళం: పాము కాటుతో వ్యక్తి మృతి

image

పొందూరు(M) తుంగపేట ఎస్సీ కొలనిలో ఉంటున్నా చెందిన ఆనందరావు సోమవారం పాముకాటుతో మృతి చెందారు. ఆనందరావు సోమవారం తన పొలంలో మినప చేనును ఇంటికి తీసుకువస్తుండగా దారిలో పాము కాటేసింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్లో చెప్పాగా వారు 108కు సమాచారం ఇవ్వడంతో పొందూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాగా అప్పట్టికే ఆయన మృతి చెందారు. ఈయన జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. స్వగ్రామం సంతకవిటి (M) సిరిపురం పంచాయతీ యాగాటిపేట.

News February 10, 2026

SKLM: కలెక్టర్ పీజీ ఆర్ఎస్‌కు 145 దరఖాస్తులు

image

అర్జీలు త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి SV లక్ష్మణమూర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో 145 దరఖాస్తులు సమర్పించారు. రెవెన్యూ భూ సమస్యలు తాగునీటి సమస్యలు మున్సిపల్ పంచాయతీరాజ్‌తో పాటు వివిధ సమస్యలకు సంబందించిన అర్జీలు సమర్పించినట్లు ఆయన అన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.