News April 27, 2024

శ్రీకాకుళం: క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్

image

కంచిలి మండలంలోని బూరగాం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాహనదారుల వివరాల ప్రకారం.. జాతీయ రహదారి డివైడర్ మధ్య మొక్కలకు నీరుపోసే వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం ధ్వంసం కాగా, క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కపోవడంతో సమాచారం అందుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు డ్రైవర్‌ను బయటకు తీసి అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు.

Similar News

News April 15, 2026

SKLM: ఇద్దరిని చంపిన వ్యక్తి సూసైడ్

image

పలాస మండలం మహదేవపురానికి చెందిన రామారావు(45) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది జరిగిన జంట హత్యల కేసులో నిందితుడైన ఇతడు, నెల కిందటే బెయిల్‌పై బయటకు వచ్చాడు. బుధవారంతో గడువు ముగియనుండగా, పూచీకత్తు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జీవిత ఖైదు తప్పదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఐ ఆర్‌వీఆర్ నాయుడు తెలిపారు.

News April 15, 2026

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఈ-బస్సులు సిద్ధం

image

APSRTC భోగాపురం ఎయిర్‌పోర్ట్ రవాణాపై దృష్టి సారించింది. విశాఖకు రానున్న 100 ఈ-బస్సుల్లో 20-30 భోగాపురం ఎయిర్‌పోర్టుకు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కేటాయించే ఈ-బస్సులను కూడా ఎయిర్‌పోర్ట్ రూట్‌లో వినియోగించనుంది. ఉత్తరాంధ్రలోని కీలక ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ఈ-బస్సులు నడపడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు RTC సిద్ధమవుతోంది.