News October 25, 2024
శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి పశుగణన సర్వే
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో శుక్రవారం నుంచి అఖిల భారత పశుగణన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పశుగణన సర్వే ఫిబ్రవరి 25 వరకు కొనసాగనుంది. జిల్లాలోని ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, కోళ్లు వంటి అన్ని రకాల మూగజీవాల లెక్కింపు చేపడతారు. దీనికోసం పశుసంవర్ధక శాఖ 257 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. రోజుకు కనీసం 50 ఇళ్లల్లో సర్వే చేయనున్నారు. పట్టణాల్లో కూడా సర్వే చేస్తారు.
Similar News
News November 15, 2024
శ్రీకాకుళం: పత్తి కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలి: మంత్రి
పత్తి కొనుగోళ్లపై వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. పత్తి రైతులకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు ఉండాలని అన్నారు. ఆయన వెంట కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు ఉన్నారు.
News November 14, 2024
పోసాని మురళీకృష్ణపై పాతపట్నంలో కలమట ఫిర్యాదు
సినీ నటుడు పోసాని మురళీకృష్ణపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పాతపట్నం పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. మురళీకృష్ణ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, టీటీడీ అధ్యక్షులు బిఆర్ నాయుడుతో పాటు పలు సంస్థల అధినేతలపైన తప్పుగా మాట్లాడినందుకు ఫిర్యాదు చేసినట్లు కలమట తెలిపారు. ఫిర్యాదును ఎస్ఐ లావణ్యకు అందజేశారు. టీడీపీ నాయకులు ఉన్నారు.
News November 14, 2024
శ్రీకాకుళం: టెన్త్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు నాలుగు రోజులే గడువు
శ్రీకాకుళం జిల్లాలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు పరీక్ష ఫీజు మరో నాలుగు రోజుల్లో చెల్లించాలి. ఈ సందర్భంగా తొలుత ప్రభుత్వం అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ లోపు చెల్లించాలని ప్రకటించగా దాన్ని ఈ నెల 18వ తేదీ వరకు గడువు పొడిగించింది. దీనితో 10వ తరగతి విద్యార్థులు 18వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజును ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.