News August 15, 2024
శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది ఈరోజే..!
నేడు శ్రీకాకుళం జిల్లా ఏర్పడిన రోజు. విశాఖపట్నం జిల్లాలో భాగంగా ఉండే ఈ జిల్లా 1950 ఆగస్టు 15న ప్రత్యేక జిల్లాగా అవతరించింది. బ్రిటిషు వారికి అప్పటి ఈ ప్రాంత రైతులు పన్నును గుడ్డ సంచిలో సమర్పించేవారు. బ్రిటిష్ వారు ఆ మూటల మూతికట్టు విప్పమని చెప్పడానికి చికాకోల్ అనేవారు. అంటే “మూతికట్టువిప్పు” అని అర్థం. ఈ మాట క్రమంగా “చికా కోల్” అయి, శ్రీకాకుళంగా స్థిరపడింది అని అంటారు.
Similar News
News September 10, 2024
శ్రీకాకుళం: వర్షాలు తగ్గినా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
వర్షాలు తగ్గుముఖం పట్టినా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఒడిశాలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా చేయాలన్నారు.
News September 9, 2024
నిమజ్జన ప్రదేశాల్లో భద్రత నియమాలు పాటించాలి: ఎస్పీ
శ్రీకాకుళంలో పొన్నాడ వంతెన ఇరువైపులా వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రదేశాలను సోమవారం ఎస్పీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులతో సందర్శించారు. భద్రతపరమైన ఏర్పాట్లపై ఆరా తీశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా నాగావళి నదిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున పొన్నాడ వంతెన, ఏడు రోడ్ల-గుజారతిపేట వంతెన, డే&నైట్ వంతెన ఇరువైపులా నిమజ్జనం చేసే ప్రదేశాలలో తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు.
News September 9, 2024
సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయండి: జిల్లా కలెక్టర్
నేడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, నదీ పరిహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా భారీ నష్టాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 08942-2405575) ఫోన్ చేయాలని, అలాగే ఈ-మెయిల్ ఐడీ coskimsupdtd@gmail.com పంపించాలని తెలిపారు.