News June 29, 2024

శ్రీకాకుళం: టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్‌కు నోటిఫికేషన్

image

10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు DEO వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలో 2,218 మంది పరీక్షలకు హాజరు కాగా 1,338 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆయన మాట్లాడుతూ.. వెరిఫికేషన్‌కు జులై 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రీకౌంటింగ్‌కు ప్రతి సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.1000 చెల్లించాలన్నారు.

Similar News

News October 12, 2024

శ్రీకాకుళం: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?

image

దసరా పండుగ అనగానే పల్లె గుర్తుకొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, స్నేహితులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. పల్లెల్లో తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.

News October 12, 2024

శ్రీకాకుళం జిల్లాలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు

image

జిల్లాలోని KGBVల్లో ఖాళీగా ఉన్న 36 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వాచ్ ఉమెన్, చౌకీదార్ పోస్టులకు కనీసం ఏడో తరగతి పాస్ అయి ఉండాలి. మిగతా పోస్టులకు నిర్దిష్ట విద్యార్హత లేదు. వయస్సు 21 నుంచి 42 వరకు కాగా, కుల ప్రాతిపదికన(47), వికలాంగులకు(52) వయస్సు పొడిగింపు ఉంది. అర్హత గలవారు ఈ నెల 15లోగా ఆయా మండలాల MEO కార్యాలయాల్లో దరఖాస్తులు అందించాలి.

News October 12, 2024

శ్రీకాకుళం జిల్లాలో వీళ్ల టార్గెట్ ఒంటరి మహిళలే

image

ఖాళీగా ఉన్న ఇళ్లు, ఒంటరి వృద్ధులు, మహిళలే లక్ష్యంగా చేసుకుని <<14332419>>చోరీలకు<<>> పాల్పడుతున్న రాజగోపాల్, కిరణ్ తండ్రికొడుకులను శ్రీకాకుళం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాజగోపాల్ ముందుగా రెక్కీ నిర్వహించి వృద్ధులు, మహిళలు ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడతారన ఎస్పీ వెల్లడించారు. వారి వద్ద రూ.7.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. కాగా వారికి ఓ మహిళ కూడా సాయపడినట్లు తెలిపారు.