News May 4, 2024

శ్రీకాకుళం: డా.బిఆర్ఏయూ పరీక్ష తేదీల్లో మార్పు

image

ఎచ్చెర్ల డా.బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ సప్లిమెంటరీ 2, 4 సెమిస్టర్ల సప్లిమెంటరీ పరీక్షల తేదీలను మార్పు చేసినట్లు డా.బిఆర్ఏయూ పరీక్షల విభాగం డీన్ డా.ఎన్.ఉదయభాస్కర్ శనివారం తెలిపారు. డిగ్రీ రెండో సెమిస్టర్ 17, 18వ తేదీల్లో జరుగుతాయని, డిగ్రీ నాలుగో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Similar News

News November 8, 2024

శ్రీకాకుళం: ‘పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలి’

image

శ్రీకాకుళం జిల్లా పరిషత్తు కార్యాలయంలో శుక్రవారం శ్రీకాకుళం జడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన సమావేశం జరిగింది. పార్టీలకు అతీతంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆమె పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ ప్రాజెక్టు అధికారి సుధాకర్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపడుతున్న వివిధ పనులను వివరించారు. 

News November 8, 2024

గంజాయి కేసులో 108మంది అరెస్ట్: శ్రీకాకుళం SP

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో గంజాయి, డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి, కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్ పాల్గొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 37కేసులు నమోదు చేశామని, 108 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గంజాయి విక్రయాలు, వినియోగం జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

News November 8, 2024

చట్ట పరిధిలోని ఫిర్యాదులను పరిష్కరిస్తాం: ఎస్పీ

image

పలాస కాశీబుగ్గ డివిజనల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం బాధితుల నుంచి ఎస్పీ మహేశ్వరరెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్ట పరిధిలోని ఫిర్యాదులను పరిష్కరిస్తామని అర్జీదారులకు భరోసా ఇచ్చారు. అనంతరం ఫిర్యాదులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.