News November 15, 2024

శ్రీకాకుళం: నార్త్ ఈస్ట్ ఏవియేషన్ సమ్మిట్‌లో కేంద్రమంత్రి

image

షిల్లాంగ్‌లో జరుగుతున్న నార్త్ ఈస్ట్ ఏవియేషన్ సమ్మిట్-2 లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం హాజరయ్యారు. పౌర విమానయాన శాఖ కార్యదర్శి వుమ్లున్ మంగ్ వుల్నామ్ అధికారులతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. గిరిశిఖర ప్రాంతాల్లో సైతం విమాన సేవలు విస్తరించడానికి, ఈశాన్య భారతం యొక్క అపారమైన సామర్థ్యాన్ని పెంపొందించడంపై చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News December 9, 2024

SKLM: మంత్రి నాదెండ్లను కలిసిన జనసేన నేతలు

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను విజయనగరం జిల్లాలోని భోగాపురం రిసార్ట్‌లో సోమవారం శ్రీకాకుళం జనసేన జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి పీసీనీ చంద్రమోహన్, జిల్లా కార్యదర్శులు వడ్డాది శ్రీనువాసరావు, తాళాబత్తుల పైడిరాజు, చిట్టి భాస్కర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు.

News December 9, 2024

వీరఘట్టం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

వీరఘట్టం మండలం వండువ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరఘట్టంకు చెందిన కూర్మాన అశోక్ చక్రవర్తి (35) అనే వ్యక్తి మృతి చెందాడు. కొంతకాలంగా పాలకొండలో నివాసం ఉంటున్న అతడు ఆదివారం వీరఘట్టం వచ్చి తిరిగి పాలకొండ వెళుతుండగా మార్గ మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్సై కళాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 8, 2024

SKLM: రైల్వే అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష

image

శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులపై విశాఖపట్నంలో ఆదివారం డివిజన్ సమావేశం నిర్వహించారు. సమీక్షలో మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. అమృత భారత్‌లో భాగంగా శ్రీకాకుళం నౌపాడ స్టేషన్ల అభివృద్ధి చేయాలని, నౌపాడ -గుణుపూర్ లైన్ క్రాసింగ్ స్టేషన్ నిర్మాణం, టెక్కలి పాతపట్నం స్టేషన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. పొందూరు – పలాస మధ్య జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు.