News April 1, 2024
శ్రీకాకుళం: ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం

ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆయన విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలానీ సమూన్ హాజరయ్యారు. ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్‌కు సంబంధించి అధికారుల బాధ్యతలు, నిర్వహించాల్సిన విధులపై సూచనలు చేశారు.
Similar News
News February 13, 2026
మందస: రాజవంశీయుడు కన్నుమూత

మందస రాజవంశీయులు కేసరి సింగ్ దేవ్ (79) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లోని ఖార్వేలా నగర్‌లో స్వగృహంలో కన్నుమూశారు. కేసరి సింగ్ దేవ్ గతంలో టెరిటోరియల్ ఆర్మీలో అధికారిగా పనిచేశారు. ఆయన అంత్యక్రియలు గురువారం సైనిక లాంఛనాలతో నిర్వహించారు. ఈయన మృతితో మందసలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ సంస్థానానికి చివరి రాజు అయిన రాజమణి రాజ్ దేవ్ ద్వితీయ కుమారుడే కేసరి సింగ్ దేవ్.
News February 13, 2026
తెల్లవారుజామున 3 గం.ల నుంచే శ్రీముఖలింగేశ్వరుడి దర్శనాలు

జలుమూరు మండలం శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈనెల 15-18 వరకు జరగన్నాయి. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున 2 గం.లకు సుప్రభాత సేవ నిర్వహించి, 3 గం.ల నుంచే స్వామి దర్శనం భక్తులకు కల్పిస్తామని ఈవో కొండలరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి 7 గం.లకు శిఖర దీపం, 10గం.లకు లింగోద్భవం, అర్ధరాత్రి 12 గం.లకు తిరువీధి కార్యక్రమం జరుగుతుందన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లను చేశామన్నారు.
News February 13, 2026
శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు అసౌకర్యం కలగకూడదు: ఐజీ గోపీనాథ్

మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం శ్రీకాకుళం ఎస్పీ, డీఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమైన ఆలయాల్లో క్యూలైన్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలను ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని సిద్ధం చేయాలన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.


