News April 20, 2024

శ్రీకాకుళం: రూ.1.37 లక్షల సొమ్ము సీజ్

image

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బెండి గేటు సమీపంలో సాధారణ ఎన్నికల్లో భాగంగా ప్లయింగ్ స్క్వాడ్ శుక్రవారం అటుగా వచ్చిన వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కారులో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.1.37 లక్షలు సొమ్మును సీజ్ చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన సొమ్మును వజ్రపుకొత్తూరు పోలీసులకు అందజేశామని ఫ్లైయింగ్ స్క్యాడ్ సిబ్బంది తెలిపారు.

Similar News

News December 5, 2025

శ్రీకాకుళం: పోలీసుల తనిఖీల్లో..శిక్షలు వీరికే

image

శ్రీకాకుళం జిల్లాలో గత నాలుగు రోజుల క్రితం పోలీసుల తనిఖీల్లో పట్టుపడిన వారికి శిక్షలు పడ్డాయి. డ్రంక్&డ్రైవ్ రూ.10వేలు, బహిరంగ మద్యం కేసుల్లో రూ.1000ల జరిమానా కోర్టు విధించిందని SP కేవీ మహేశ్వరెడ్డి నిన్న తెలిపారు. సోంపేట-3, బారువా-1, పలాస-16, టెక్కలి-3, మెళియాపుట్టి-9, డ్రంక్&డ్రైవ్-నరసన్నపేటలో ఒకరికి రూ.2,500, మరొకరికి రూ.5000లు ఫైన్ వేశారు. ఆమదాలవలస, సారవకోట-ఇద్దరికి 5 రోజుల జైలు శిక్ష పడింది.

News December 5, 2025

నాకు బతకాలని లేదు: శ్రీకాకుళం యువతి సూసైడ్

image

విజయనగరం బీసీ హాస్టల్‌లో డిగ్రీ విద్యార్థిని సూసైడ్ కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు..VZM మహారాజ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్వాతి ఈ బలవన్మరణానికి పాల్పడింది. ఆమెది శ్రీకాకుళం(D)శ్రీకూర్మంగా పోలీసులు గుర్తించారు. తన డైరీలోని ఓ పేజీలో ‘అమ్మ.. నాన్నా నాకు బతకాలని లేదు. ఎందుకో భయమేస్తోంది. నేను ఏ తప్పు చేయలేదు’ అని స్వాతి రాసిన సూసైడ్ నోట్ బయటపడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 4, 2025

SKLM: ‘ప్రజలు సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత’

image

క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సైతం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడంపైనే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. సచివాలయం నుంచి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎం కుసుమ పథకం కింద ఉన్న భూమి వివాదాలు, ఎరువులు సరఫరా లోపాలు, పెన్షన్ల పంపిణీలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు.