News January 29, 2025

శ్రీకాకుళం: వర్సటీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఎచ్చెర్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పలు కోర్సుల పరీక్షలు ఫలితాలను ఎగ్జామినేషన్స్ డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ మంగళవారం విడుదల చేశారు. ఈ ఫలితాలను జ్ఞానభూమి వెబ్సైట్, విశ్వవిద్యాలయ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచామన్నారు. రీవాల్యుయేషన్‌కు 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. మార్కుల జాబితాలు విద్యార్థులకు అందజేస్తామని చెప్పారు. 

Similar News

News February 13, 2025

పాతపట్నం: లారీ ఢీకొని బాలిక దుర్మరణం

image

లారీ ఢీకొని బాలిక మృతి చెందిన ఘటన HYDలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పాతపట్నంకు చెందిన శ్రీనివాస్ HYDకు వలస వచ్చి చైతన్య బస్తీలో ఉంటున్నారు. వారి కుమార్తె మమత(17). ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండేది. మంగళవారం రాత్రి స్నేహితుడితో కలిసి మూసాపేట్ Y జంక్షన్ వద్దకు రాగానే స్కూటీని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News February 13, 2025

వాసుదేవు పెరుమాళ్ బ్రహ్మోత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం

image

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందసలో ఈ నెల 17వ తేదీ నుంచి శ్రీ వాసుదేవుని పెరుమాళ్ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆలయ ప్రధాన అర్చకులతో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో మందస గ్రామ పెద్దలు కూటమి నాయకులు పాల్గొన్నారు.

News February 12, 2025

శ్రీకాకుళం: మరణంలోనూ వీడని బంధం..!

image

యాదృచ్ఛికమో, దైవ నిర్ణయమో కానీ ఒకే రోజు వీరి వివాహం జరిగింది. మరణం కూడా ఒకేరోజు గంటల వ్యవధిలో సంభవించింది. ఒకేరోజు అనారోగ్యంతో బావ, బామ్మర్ది మృతి చెందిన విషాదకర సంఘటన మందస మండలంలో చోటుచేసుకుంది. సార సోమేశ్వరరావు (58) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా, మరోవైపు కొర్రాయి నారాయణరావు (58) కూడా సోమేశ్వరరావు మృతి చెందిన కొన్ని గంటల్లోనే అనారోగ్యంతో ప్రాణాలు విడిచాడు.

error: Content is protected !!