News November 30, 2024
శ్రీకాకుళం: PG సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

శ్రీకాకుళం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సులకు సంబంధించి (ఆర్ట్స్ & సైన్స్) 3వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ శనివారం విడుదల చేశారు. పరీక్షలు డిసెంబర్ 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించనున్నారు.
Similar News
News February 11, 2026
మహాశివరాత్రి ఉత్సవాలకు కంట్రోల్ రూమ్: కలెక్టర్

సారవకోట మండలం శ్రీముఖలింగం క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ‘కంట్రోల్ రూమ్’ ఏర్పాటు చేశామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. అధికారులకు కేటాయించిన విధుల్లో శ్రద్ధతో పనిచేయాలన్నారు.

News February 10, 2026
శ్రీకాకుళం: పాము కాటుతో వ్యక్తి మృతి

పొందూరు(M) తుంగపేట ఎస్సీ కొలనిలో ఉంటున్నా చెందిన ఆనందరావు సోమవారం పాముకాటుతో మృతి చెందారు. ఆనందరావు సోమవారం తన పొలంలో మినప చేనును ఇంటికి తీసుకువస్తుండగా దారిలో పాము కాటేసింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్లో చెప్పాగా వారు 108కు సమాచారం ఇవ్వడంతో పొందూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాగా అప్పట్టికే ఆయన మృతి చెందారు. ఈయన జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. స్వగ్రామం సంతకవిటి (M) సిరిపురం పంచాయతీ యాగాటిపేట.