News March 22, 2024
శ్రీకాకుళానికి శంకర్, పలాస నుంచి గౌతు శిరీషా
TDP మూడో అభ్యర్థుల జాబితాలో.. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం MLA అభ్యర్థిగా గొండు శంకర్, పాతపట్నం నుంచి మామిడి గోవింద్ కుమార్, పలాస నుంచి గౌతు శిరీషా ఖరారయ్యారు. కాగా శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్, MLA అభ్యర్థిగా వైసీపీ ధర్మాన ప్రసాద్ ఉన్నారు. పాతపట్నంలో రెడ్డి శాంతి, పలాసలో సిదిరి అప్పలరాజు బరిలో ఉన్నారు.
Similar News
News September 12, 2024
శ్రీకాకుళం: విజిలెన్స్ ఎస్పీగా ప్రసాదరావు బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్ ఎస్పీగా బర్ల ప్రసాదరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పీ సురేష్ బాబు నుంచి పదవీ బాధ్యతలు తప్పకున్నారు. అనంతరం జిల్లా స్థాయి విజిలెన్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్పీకి పలువురు అభినందనలు తెలియజేశారు.
News September 12, 2024
శ్రీకాకుళం: దసరా,దీపావళికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే దసరా, దీపావళి ఫెస్టివల్స్‌కు శ్రీకాకుళం నుంచి తిరుపతికి (07443), తిరుపతి నుంచి శ్రీకాకుళానికి (07442) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ద.మ రైల్వే అధికారులు ఓ ప్రకటనలో గురువారం తెలిపారు. 07443 రైలు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు నడుస్తుందన్నారు. 07442 రైలు అక్టోబర్ 06 నుంచి నవంబర్ 10 వరకు నడుస్తుందని..ప్రయాణికులు గమనించాలని కోరారు.
News September 12, 2024
సోంపేట: అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయింది. 20 మంది ప్రయాణీకులతో శ్రీకాకుళం నుంచి బయలుదేరిన బస్సు సోంపేట మండలం మామిడిపల్లి గ్రామం సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు గల కారణాలు తెలియరాలేదు.