News November 30, 2025

శ్రీకాళహస్తిలో కార్లపై పడ్డ చెట్టుకొమ్మలు

image

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం కారు పార్కింగ్‌లో ఉన్న కార్లపై చెట్టుకొమ్మలు పడడంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి సొంత వాహనాలలో విచ్చేసిన భక్తుల కష్టాలు వర్ణణాతీతంగా మారింది. శ్రీకాళహస్తికి ఆదివారం తమిళనాడు, ఆంధ్రకు చెందిన భక్తులు కార్లల్లో దర్శనానికి వచ్చారు. పార్కింగ్లో కారులు ఉంచి దర్శనానికి వెళ్లారు. ఇంతలో కురుస్తున్న వర్షాలకు చెట్టుకొమ్మలు పడి 3 కార్లు దెబ్బతిన్నాయి.

Similar News

News February 17, 2026

BREAKING: ఇంద్రేశం ఛైర్మన్ పీఠం BRS కైవసం

image

కోరం లేక వాయిదా పడిన ఇంద్రేశం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. రెండో రోజు 10 మంది BRS, ఇద్దరు BJP కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయడంతో కోరం లభించింది. అనంతరం జరిగిన ఎన్నికలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా 8వ వార్డు BRS కౌన్సిలర్ కుషాంగుల ప్రమీల, వైస్ ఛైర్మన్‌గా 12వ వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల హరీశ్ రెడ్డి ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గానికి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

News February 17, 2026

BREAKING: ఇల్లందు మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా దొడ్డ కిరణ్ మిత్ర

image

ఇల్లందు మునిసిపాలిటీ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా రెండవ వార్డు కౌన్సిలర్ దొడ్డ కిరణ్ మిత్రను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఫైనల్ చేసింది. దొడ్డ కిరణ్ మిత్ర భర్త పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయతగా పనిచేస్తున్న వారికే అధిష్టానం మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టడం విశేషం. వైస్ ఛైర్మన్‌గా పెండ్యాల రాజు ఎన్నికయ్యారు.

News February 17, 2026

కనుపూరు ముత్యాలమ్మ జాతర ఎప్పుడో తెలుసా..

image

చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో వెలసియున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మార్చి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు ప్రసిద్ధిగాంచారు. ఈ జాతరకు ఏటా 5 లక్షల నుంచి 10 లక్షల వరకూ భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షలు పొందుతారు. ఈ జాతరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు.