News December 1, 2025

శ్రీపతిపల్లి: సర్పంచ్ బరిలో సొంత అన్నదమ్ములు

image

‘తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే’ అన్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత అన్నదమ్ములు ప్రధాన రాజకీయ పార్టీల సర్పంచ్ అభ్యర్థులుగా ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. చిల్పూర్(M) శ్రీపతిపల్లికి చెందిన రంగు రమేష్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా, ఆయన సోదరుడు రంగు హరీష్ BRS బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఒకే కుటుంబం నుంచి పోటీలో నిలవడంతో విజయం ఎవరిని వరిస్తుందోనని గ్రామంలో తీవ్ర చర్చ నడుస్తోంది.

Similar News

News February 7, 2026

జనగామను వీడిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ఎంటర్

image

మూడు రోజులుగా జనగామ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేసిన పెద్ద పులి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించిందని డీఎఫ్ఓ లావణ్య వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి రఘునాథపల్లి మండలంలో సంచరించిన పులి శుక్రవారం అర్ధరాత్రి నర్మెట్ట మండలం మీదుగా సిద్దిపేట జిల్లాలోకి వెళ్లిందని తెలిపారు. ఏదేమైనా పులి చిక్కేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News February 7, 2026

MBNR: పుర పోరు.. నేతల్లో వణుకు !

image

ఉమ్మడి జిల్లాలోని ఒక కార్పొరేషన్,18 మున్సిపాలిటీల పీఠాలను దక్కించుకోవడం ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఎన్నికలలో వచ్చే ఫలితాలే తమ పొలిటికల్ కెరీర్‌కు లైఫ్ సర్టిఫికెట్ అని మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీలు భావిస్తున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ విందులు, వినోదాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కాంగ్రెస్, BRS, BJP మధ్య త్రిముఖపోటీ నేపథ్యంలో ఆయా పార్టీల నేతల్లో ముందస్తు వణుకు మొదలైంది.

News February 7, 2026

ఇలాంటి సేంద్రియ ఎరువులతో ఎక్కువ లాభం

image

గాఢ సేంద్రియ ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్‌ వంటి పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి నేలకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. ఉదాహరణ: కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి, ఆముదపు పిండి, కానుగ పిండి, పత్తి గింజల పిండి, చేపల పొట్టు, ఎముకల పొడి, కొమ్ముల పొడి, వర్మి కంపోస్టు మొదలైనవి. వీటి కొనుగోలు కాస్త ఖర్చుతో కూడుకున్నదైనా నిపుణుల సూచనల మేరకు వీటిని వినియోగిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది.