News September 10, 2025
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అప్డేట్ @7AM

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ నిండు కుండను తలపిస్తోంది. ఈరోజు ఉదయం 7 గంటల సమయానికి 54,545 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. అటు ప్రాజెక్టులో 80.5 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 8 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు.
Similar News
News December 17, 2025
కరీంనగర్: ముగిసిన మూడో పోరు.. విజేత ఎవరో..?

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 388 GPలకు, 1580 వార్డులకు జరిగిన మూడో పోరు ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ముందుగా వార్డు సభ్యుల బ్యాలెట్లను లెక్కించనున్నారు. 25 ఓట్లను ఓ కట్టగా కట్టి, ఆ తర్వాత వార్డుల వారీగా లెక్కించనున్నారు. వార్డులు ముగిసిన వెంటనే సర్పంచ్ కౌంటింగ్ పూర్తి చేస్తారు. అనంతరం ఉప సర్పంచ్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.
News December 17, 2025
చేతిలో డబ్బు నిలవాలంటే..

ధనం వస్తూ ఖర్చు అవుతూ ఉంటే, ఇంట్లో దానిమ్మ లేదా అరటి మొక్క దగ్గర రోజూ సాయంత్రం దీపం వెలిగించాలి. ప్రతి సోమవారం శ్రీసూక్తం పఠిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అలాగే, శ్రీయంత్రం, కనకధారా యంత్రం, కుబేర యంత్రం ఈ మూడింటిని పూజా మందిరంలో ఉంచి, రోజూ పూజిస్తే లక్ష్మీకటాక్షం లభించడం తథ్యం. ఇలా చేయడం ద్వారా డబ్బు నిలవక పోవడం అనే సమస్య తగ్గుతుంది.
News December 17, 2025
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


