News April 7, 2025
శ్రీరామనవమి విజయం పట్ల భద్రాద్రి కలెక్టర్ హర్షం

భద్రాచలంలో శ్రీరామనవమి,మహా పట్టాభిషేకం వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరగడం పట్ల భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హర్షం వ్యక్తం చేశారు. వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులకు ఏర్పాట్లు చేసేందుకు అధికారులకు కేటాయించిన విధులను సమన్వయంతో పూర్తి చేసి భక్తుల మన్ననలు పొందారని ఆయన తెలిపారు. ఉత్సవాలు విజయవంతంగా జరుగుటలో భక్తులు ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం సలహాలు, సూచనలు పాటిస్తూ సహకరించారన్నారు.
Similar News
News April 18, 2025
గద్వాల్: బెట్టింగ్ భూతానికి ఎంటెక్ విద్యార్థి బలి

ఆన్‌లైన్ బెట్టింగ్ ఎంటెక్ విద్యార్థి ప్రాణాలు బలికొంది. ఎస్ఐ వివరాలు.. గద్వాలకు చెందిన పవన్(22) HYDలో ఎంటెక్ చేస్తున్నాడు. బెట్టింగ్‌లకు అలవాటు పడిన పవన్ వివిధ లోన్ యాప్‌ల నుంచి రుణాలు తీసుకుని ఆడుతూ డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ విషయమై తండ్రితో చెప్పగా రూ.98,200 పంపించాడు. అయినా అప్పులు తీరకపోవడంతో బైక్, ఐపోన్ అమ్మేశాడు. ఇంకా అప్పులు ఉండటంతో ఉరేసుకున్నాడు.
News April 18, 2025
రేపు జేఈఈ మెయిన్ ఫలితాలు: NTA

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫలితాలను రేపు వెల్లడిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ప్రకటించింది. ఫైనల్ ఆన్సర్ కీలను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అధికారిక <
News April 18, 2025
ఖమ్మం: అనుమానస్పద స్థితిలో బావిలో బాలుడి మృతదేహం

అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడి మృతదేహం బావిలో లభ్యమైన ఘటన శుక్రవారం బోనకల్ మండలంలో చోటు చేసుకుంది. లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలోని వ్యవసాయ బావిలో తెల్లవారుజామున ఓ బాలుడి మృతదేహం తేలియాడుతూ స్థానికుల కంటపడింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడా? లేక ఎవరైనా హత్య చేశారా? వంటి కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది.