News August 22, 2025

శ్రీరామపాదక్షేత్రంలో అద్భుత దృశ్యం

image

నాగాయలంకలోని శ్రీరామపాదక్షేత్రంలో గురువారం సూర్యాస్తమయం అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. నది అలలు, చల్లటి గాలులు, ఆకాశంలో మెరిసిన సప్త వర్ణాలు భక్తులను, పర్యాటకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ ఆధ్యాత్మిక ప్రదేశంలో ప్రకృతి సోయగాలను వీక్షిస్తూ అందరూ పరవశించిపోయారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక అనుభూతి ఒకేచోట కలగడంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది.

Similar News

News January 16, 2026

జగిత్యాల కలెక్టరేట్‌లో విద్యా ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

image

జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌లో TGMREIS ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ టి. సుచిత్ర పాల్గొని, అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News January 16, 2026

కౌన్సిలింగ్ కోసం AP RCET అభ్యర్థుల ఎదురుచూపులు

image

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో PhD ప్రవేశాల కోసం గత ఏడాది నవంబర్‌లో తిరుపతి SPWU ఆధ్వర్యంలో AP RCET పరీక్షలు నిర్వహించారు. డిసెంబర్ 15న ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు విడుదలై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కౌన్సిలింగ్ తేదీలు ఎప్పుడు వస్తాయేమో అని అర్హత సాధించిన అభ్యర్థులకు ఎదురుచూస్తున్నారు. అధికారులు స్పందించి AP RCET కౌన్సిలింగ్, అడ్మిషన్లు చేపట్టాలని కోరుతున్నారు.

News January 16, 2026

జగిత్యాల: కులాంతర వివాహ జంటలకు రూ.37.50 లక్షల బాండ్ల పంపిణీ

image

జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జరిగిన కార్యక్రమంలో కులాంతర వివాహం చేసుకున్న 15 జంటలకు ఒక్కో జంటకు రూ.2.50 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు పంపిణీ చేశారు. మొత్తం రూ.37.50 లక్షల విలువైన బాండ్లను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొన్నారు.