News February 19, 2025
శ్రీలత రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే!

BJP జిల్లా పార్టీ పగ్గాలు తొలిసారి మహిళ చేతిలోకి వెళ్లాయి. జిల్లా అధ్యక్షురాలిగా నేరేడుచెర్లకు చెందిన శ్రీలతరెడ్డిని అధిష్ఠానం నియమించింది. 2019లో BRSతో రాజకీయప్రస్థానం మొదలుపెట్టిన ఈమె నేరేడుచెర్ల మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2023లో MP ఈటల సమక్షంలో BJPలో చేరి HNR నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాగా ఆమె సోదరుడు పోరెడ్డి కిషోర్ BJPలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.
Similar News
News April 15, 2026
లేట్ ప్రెగ్నెన్సీలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్

35 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చడం వల్ల డెలివరీలో కాంప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్లాసెంటా ప్రీవియా, ప్రీఎక్లాంప్సియా, నెలలు నిండకముందే డెలివరీ కావడం, తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే పుట్టే బిడ్డల్లో కూడా డౌన్ సిండ్రోమ్, బిడ్డకు బీపీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డెలివరీ దగ్గర పడే కొద్దీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News April 15, 2026
GNT: దొరకని రిమాండ్ ఖైదీ ఆచూకీ

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) నుంచి రిమాండ్ ఖైదీ భీముడు అజిత్ కుమార్ పరారయ్యాడు. అనారోగ్య కారణాలతో రేపల్లె సబ్ జైలు నుంచి చికిత్స కోసం వచ్చిన ఇతడు, మూత్ర విసర్జన సాకుతో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఏలూరుకు చెందిన అజిత్‌పై గతంలో చీటింగ్ కేసులు ఉన్నాయి. ఎస్కార్ట్ ఉండగానే ఖైదీ చెక్కేయడం పోలీసులకు సవాల్‌గా మారింది.
News April 15, 2026
బీట్‌రూట్‌తో హెల్తీ హెయిర్

అందంగా, ఆరోగ్యంగా ఉండే హెయిర్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం వివిధ కారణాల వల్ల చాలామంది జుట్టు సమస్యలతో బాధ పడుతున్నారు. దీనికి బీట్‌రూట్ పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల తల్లోని జిడ్డు, చుండ్రు తగ్గుతాయి. దీంట్లోని ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు మాడు రక్తప్రసరణను పెంచి కుదుళ్లను దృఢంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందంటున్నారు.


