News February 19, 2025
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు.. ముఖ్యమైన అంశాలు!

● శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
● అన్ని ఆర్జిత సేవలు రద్దు.. ప్రముఖులకు 4విడతలుగా బ్రేక్ దర్శనం
● 22న టీటీడీ తరఫున స్వామి, అమ్మవార్లకు వస్త్రాల అందజేత
● 23న సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ
● కాలినడక భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి
● శివరాత్రి రోజున ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం
● భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం
● ఘాట్‌లో 24గంటల అనుమతి
● 453 స్పెషల్ బస్సులు ఏర్పాటు
Similar News
News April 14, 2026
మరోసారి తెలుగు సినిమాలో ఆలియా?

అందంతో పాటు విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆలియా భట్. ఆమె తెలుగులో ఇప్పటివరకు ఒక్క సినిమాలోనే(RRR) నటించారు. త్వరలోనే మరో మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. NTR-NEEL మూవీలో ఓ కీలక పాత్రలో నటించేందుకు ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాలు తెలిపాయి. ఆలియా ప్రస్తుతం ‘ఆల్ఫా’, ‘లవ్&వార్’ సినిమాల్లో నటిస్తున్నారు.
News April 14, 2026
రేవంత్ చెబుతున్న హైబ్రిడ్ నమూనా ఎక్కడా లేదు: కిషన్ రెడ్డి

TG: డీలిమిటేషన్‌తో దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలన్నదే తమ విధానమన్నారు. ‘రేవంత్ చెబుతున్న <<19646674>>హైబ్రిడ్ నమూనా<<>> ఎక్కడా లేదు. TGలో ఆ విధానాన్ని అమలు చేస్తే ఆదిలాబాద్‌కు సీట్లు తగ్గించి HYDకు పెంచుతారా? రాష్ట్ర ఆదాయంలో 70% HYD నుంచే వస్తోంది. అలాంటప్పుడు 70% సీట్లు HYDలోనే ఉండాలా’ అని ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించారు.
News April 14, 2026
గద్వాల్: చేనేత కార్మికులకు శుభవార్త

జోగులాంబ గద్వాల జిల్లా చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేనేత కార్మికులు ఎదురుచూస్తున్న చేనేత భరోసా పథకం ఈ నెల 16న గద్వాలలోని అనంత కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ప్రారంభించనున్నట్లు ఏడీవో బాలకృష్ణ తెలిపారు. చేనేత రుణమాఫీ, చేనేత భరోసా, చేనేత భీమా పథకాలకు సంబంధించిన చెక్కులను గురువారం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కార్మికులందరూ రావాలని ఆహ్వానించారు.


