News August 21, 2025
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాపై కేసు నమోదు

అటవీ సిబ్బందిపై దాడి ఘటనలో శ్రీశైలం ఎమ్మెల్యే <<17469207>>బుడ్డా<<>> రాజశేఖర్ రెడ్డి, జనసేన నేత అశోక్‌పై కేసు నమోదైంది. శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషనులో అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటన సీఎం చంద్రబాబు దృష్టికి చేరగా ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News January 17, 2026
నెల్లూరు: తీరం దాటిన సరదా.. అన్నాచెల్లెలు మృతి

కనుమ సంబరం కాస్తా కన్నీటి సంద్రమైంది. పండగ పూట కొత్త బట్టలు వేసుకుని, బంధువుల ఇళ్లలో సందడి చేయాల్సిన ఆ పసి ప్రాణాలు సముద్రపు అలల ఉధృతికి బలయ్యాయి. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి తీరంలో జరిగిన ఈ విషాదం కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు, మనందరికీ ఒక హెచ్చరిక. ఒకే ఇంట్లో ఇద్దరు బిడ్డలు (అమ్ములు, బాలకృష్ణ) ప్రాణాలు కోల్పోవడం ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
News January 17, 2026
యూరియాకు గుళికలు కలుపుతున్నారా?

వరి సాగులో చాలా మంది రైతులు మొదటి దఫా యూరియా వేసేటప్పుడు బస్తా యూరియాకు 4-5 కిలోల గుళికల మందును కలిపి చల్లుతారు. పైరు బాగా పెరగడానికి యూరియా.. పురుగుల నివారణకు గుళికల మందు ఉపయోగపడుతుందనేది రైతుల భావన. కానీ పురుగుల కట్టడికి ఎకరాకు మందు రకాన్ని బట్టి 8-10 కిలోల గుళికలు అవసరం. తక్కువ వేస్తే పురుగులు వాటిని తట్టుకొని నిలబడతాయి. అందుకే రైతులు గుళికల మందు వాడకంలో వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.
News January 17, 2026
భూగర్భంలో JBS- శామీర్‌పేట మెట్రో..!

హైదరాబాద్ మెట్రో ఫేజ్- 2లో భాగంగా జేబీఎస్(JBS) నుంచి శామీర్‌పేట వరకు రాజీవ్ రహదారి మీదుగా సుమారు 17 కిలోమీటర్ల కొత్త మెట్రో లైన్ నిర్మిస్తున్నారు. ఇది ఉత్తర హైదరాబాద్ ప్రయాణాన్ని సులభతరం చేసే కీలక ప్రాజెక్ట్. ఈ దారిలో ఉన్న హకీంపేట ఎయిర్ బేస్ రక్షణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ఆర్మీ నిబంధనల ప్రకారం అక్కడ మెట్రోను పిల్లర్లపై కాకుండా భూగర్భంలో (<<18874590>>Underground<<>>) నిర్మించాల్సి వస్తోంది.


