News October 8, 2025
శ్రీశైలానికి తగ్గిన వరద.. 4 గేట్లు మూసివేత

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో బుధవారం 6 గేట్లలో 4 గేట్లను మూసివేశారు. ప్రస్తుతం 2 గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు 55,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మధ్యాహ్నం మూడు గంటల సమయానికి జూరాల, సుంకేసుల, హంద్రీ ప్రాజెక్టుల ద్వారా 67,120 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలానికి చేరింది. దీంతో డ్యామ్ నీటిమట్టం 884.40 అడుగులకు చేరింది.
Similar News
News January 23, 2026
GHMCలో భారీ మార్పులు!

GHMC తన IT వ్యవస్థను మారుస్తోంది. హాజరు, పన్నులకే పరిమితం కాకుండా క్లౌడ్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌తో కూడిన కొత్త వ్యవస్థను అమల్లోకి తెస్తోంది. డేటా ఇంటిగ్రిటీని కాపాడేందుకు ఓపెన్ కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా సిస్టమ్ ఇంటిగ్రేటర్‌ను ఎంపిక చేయనున్నారు. ఫీల్డ్ లెవల్ యాక్టివిటీస్‌ను రియల్ టైమ్‌లో చూసేలా ఈ ప్లాట్‌ఫారమ్ డిజైన్ చేశారు. దీంతో ఫీల్డ్ రిపోర్టుల్లో తప్పుడు సమాచారానికి తావుండదు.
News January 23, 2026
ఫోన్ ట్యాపింగ్ నేరం కాదనేది ప్రజలు గుర్తించాలి: RS ప్రవీణ్

TG: ఫోన్ ట్యాపింగ్ నేరం కాదనేది ప్రజలు గుర్తించాలని BRS నేత RS ప్రవీణ్ కుమార్ చెప్పారు. ‘దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ట్యాపింగ్ చేయడం సర్వసాధారణం. ఇలా చేయొచ్చని చట్టమే చెబుతోంది. ఫోన్లు, ఈమెయిల్స్ ట్యాపింగ్ చేస్తున్నామని గతంలో మన్మోహన్ పార్లమెంటులో చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో ట్యాపింగ్ జరుగుతున్నా ఎక్కడా చర్చ లేదు. దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని ఈ ప్రభుత్వం బజారున పడేసింది’ అని మండిపడ్డారు.
News January 23, 2026
వికారాబాద్ పాలిటిక్స్‌లో ‘వారసురాళ్ల’ జోరు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సీనియర్ నేతల వారసురాలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఇక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె అనన్య, మరోవైపు మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ కుమార్తె చంద్ర ప్రియ తమదైన శైలిలో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఛైర్‌పర్సన్ కుర్చీని కైవసం చేసుకుంటారో చూడాలి.


