News June 20, 2024

శ్రీ మఠంలో కర్ణాటక అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్

image

మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు కర్ణాటక రాష్ట్రానికి అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మారుతి సాంబ్రాణి కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి మఠం సహాయ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి స్వాగతం పలికారు. అనంతరం మంచాలమ్మ దేవికి విశేష కుంకుమార్చన నిర్వహించారు. గురురాయల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించుకుని ముక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం శ్రీమఠంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

Similar News

News January 21, 2026

కర్నూలు: ఎయిడెడ్ పోస్టుల భర్తీకి పరీక్షా షెడ్యూల్ విడుదల

image

కర్నూలు జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి డీఈవో సుధాకర్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దుపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల్లో ఈనెల 27 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News January 21, 2026

ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలోని రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పంటలో రైతులకు అధిక దిగుబడి, లాభాలు వచ్చేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.ఈ సమావేశంలో అగ్రికల్చర్ ఆఫీసర్ వరలక్ష్మి పాల్గొన్నారు.