News April 13, 2024
శ్రీ సత్యసాయి: ఇంటర్ ఫలితాలలో టాపర్‌గా నిలిచిన రైతు కూలీ బిడ్డ

బత్తలపల్లి మండలానికి చెందిన చెలిమి రామ్మోహన్, ఆదెమ్మల కుమార్తె గౌతమి మండల టాపర్‌గా నిలిచింది. ధర్మవరంలోని కళాశాలలో చదువుతూ ఎంపీసీ మొదటి సంవత్సరంలో 465/470 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు రైతు కూలీలుగా జీవనం సాగిస్తూ తమ బిడ్డను చదివిస్తున్నారు. మండల టాపర్‌గా నిలిచిన గౌతమిని కురుబ కార్పొరేషన్ ఛైర్మన్ కోటి బాబు అభినందించారు.
Similar News
News December 8, 2025
అనంత: ఈనెల 21న పల్స్ పోలియో.!

ఈనెల 21న వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అనంత జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం ఆదేశించారు. జిల్లాలో 2,84,774 మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు. జిల్లాలోని 82 యూనిట్లలో కార్యక్రమం జరుగుతుందని అధికారులు వెల్లడించారు.
News December 8, 2025
అనంత: అనాధ పిల్లలకు హెల్త్ కార్డుల పంపిణీ

అనాధ పిల్లల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని అనాధ పిల్లలకు హెల్త్ కార్డులను తయారు చేయించింది. అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఈ కార్డులను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఈ సేవను అందిస్తున్న సంగతి తెలిసిందే.
News December 8, 2025
అనంత: ఈనెల 10లోపు టెట్.!

అనంతపురంలో ఈనెల 10 నుంచి 21 వరకు TET పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన 7 కేంద్రాల్లో సెషన్ వన్ ఉదయం 9.30 నుంచి 12 వరకు, సెషన్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 షిఫ్టుల్లో జరుగుతాయని వెల్లడించారు.


