News February 18, 2025

శ్రీ సత్యసాయి: చెట్టుకు ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు ధర్మవరం మండలం మాలకాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 10, 2026

విశాఖలో సరికొత్త పర్యాటక హంగులు

image

విశాఖలో అడ్వెంచర్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు VMRDA కీలక అడుగు వేసింది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో అత్యాధునిక ‘రోప్‌వే’ & ‘లూజ్ గ్రావిటీ రైడ్’ అభివృద్ధికి టెండర్లు (RFP) ఆహ్వానించింది. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించే ఈ ప్రాజెక్టు విశాఖ పర్యాటక రంగానికి మరింత ఊపునివ్వనుంది. దీని ద్వారా విదేశీ తరహా వినోద క్రీడలు ఇకపై మన నగరంలోనే అందుబాటులోకి రానున్నాయి.

News March 10, 2026

FDI రూల్స్ సడలించిన కేంద్రం

image

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2020లో తెచ్చిన రూల్స్‌ను సవరించినట్లు తెలుస్తోంది. పాత రూల్‌లో చైనా సహా భారత్‌తో సరిహద్దు పంచుకున్న దేశాల సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే కేంద్రం అనుమతి ఉండాల్సిందే. ఇతర విదేశీ సంస్థలైనా సరే వాటిలో ఈ దేశాల వాటా ఉంటే ఈ రూల్ వర్తిస్తుంది. చైనాతో ఉద్రిక్తతలు, దేశ భద్రత దృష్ట్యా గతంలో ఈ నిబంధన తెచ్చింది. తాజాగా ఈ నిబంధన మార్చింది.

News March 10, 2026

ఈనెల 13న పీఎం కిసాన్ నిధులు విడుదల

image

పీఎం కిసాన్ పెట్టుబడి సాయం నిధుల విడుదలపై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 13న 22వ విడత డబ్బులను అర్హులైన రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఈ డబ్బులు రిలీజ్ చేయనున్నారు. దీని వల్ల 9.32 కోట్ల మంది రైతులకు లబ్ధి కలగనుంది. 2019 నుంచి కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలను పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.