News March 8, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 319 మంది గైర్హాజరు

image

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెట్-3 ప్రశ్నాపత్రంతో పరీక్షలు నిర్వహించినట్లు డీఐఈఓ రఘునాథరెడ్డి శనివారం తెలిపారు. పరీక్షలకు జనరల్ విద్యార్థులు 8,198 మందికి గానూ 7,979 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,641 మందికి గానూ 1,541 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. 319 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని వివరించారు.

Similar News

News March 20, 2025

సినీ ఇండస్ట్రీకి మహిళా కమిషన్ వార్నింగ్

image

TG: సినిమా పాటల్లో డాన్స్ స్టెప్స్ అసభ్యకరంగా, మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయని రాష్ట్ర మహిళా కమిషన్ పేర్కొంది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే మాధ్యమమని, మహిళలను అవమానించే అంశాలు తీవ్ర ఆందోళనలకు గురిచేస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సినీ దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

News March 20, 2025

గద్వాల: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలో 44వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. హైవేపై ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. దీంతో కారు డ్రైవర్ ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఉండవెల్లి ఎస్ఐ మహేశ్ ఘటనా స్థలానికి పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

News March 20, 2025

ధోనీయా మజాకా… యాడ్ వీడియో భారీ సక్సెస్

image

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన <<15801433>>యాడ్<<>> భారీ విజయం పొందిందని సదరు ఈ-సైకిల్ కంపెనీ సీఈవో కునాల్ గుప్తా ట్వీట్ చేశారు. కేవలం 24 గంటల్లోనే యాడ్ వీడియోకు 50 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఇది మాస్టర్ స్ట్రోక్ అని, వ్యూస్ పెరుగుతుండటం చూస్తుంటే సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ లుక్‌లో తలా నటించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!