News September 11, 2025

శ్రీ సత్యసాయి జిల్లా కొత్త కలెక్టర్ ఈయనే!

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా శ్యామ్ ప్రసాద్ నియమితులయ్యారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. తాజాగా ప్రభుత్వం బదిలీ చేయడంతో త్వరలో సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు ప్రస్తుత కలెక్టర్ టీఎస్ చేతన్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.

Similar News

News December 8, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు ఇలా

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2033, కనిష్ఠ ధర రూ.1655; వరి ధాన్యం(1010) గరిష్ఠ ధర రూ.2010, కనిష్ఠ ధర రూ.1700; వరి ధాన్యం(జైశ్రీరాం) గరిష్ఠ ధర రూ.2921, కనిష్ఠ ధర రూ.2851గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు. ఈరోజు మొత్తం 240 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయన్నారు.

News December 8, 2025

సీఎం సరికొత్త ఆలోచన.. HYDలో డొనాల్డ్ ట్రంప్ రోడ్

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ఇపుడు హైదరాబాద్‌లోని ఓ రోడ్డుకు పెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సిటీలోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ వద్ద ఉన్న రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని నామకరణం చేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే ఇది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ విషయాన్ని కేంద్రానికి, యూఎస్ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ లేఖ రాయనున్నట్లు సమాచారం.

News December 8, 2025

వికసిత్ భారత్‌లో తెలంగాణ రైజింగ్ భాగం: గవర్నర్

image

TG: 2047 వికసిత్ భారత్‌లో తెలంగాణ రైజింగ్ ఓ భాగమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. ‘లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోంది. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఆవిష్కరణల్లో ముందంజలో ఉంది. 2047నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తుందని నమ్మకం ఉంది. లక్ష్యం దిశగా రేవంత్ సర్కార్ విజన్‌తో పనిచేస్తోంది’ అని చెప్పారు.