News January 11, 2026

శ్రీ సత్యసాయి: పోలీసునంటూ డబ్బులు వసూలు

image

నకిలీ పోలీసును తనకల్లు రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు. కదిరి రైల్వే SI బాలకృష్ణ వివరాల మేరకు.. TPT(D) బోడేవాండ్లపల్లికి చెందిన రవిశంకర్ పలుచోట్ల హోంగార్డుగా పనిచేశాడు. తాగుడుకు బానిసై ఆరోపణలు రావడంతో జాబ్ నుంచి తొలగించారు. నకిలీ పోలీస్ అవతారమెత్తి రైళ్లలో ప్రయాణికులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసేవాడు. కదిరికి చెందిన నారాయణస్వామిని బెదిరించి రూ.1500 లాక్కున్నాడు. అతని ఫిర్యాదుతో అరెస్టు చేశారు.

Similar News

News January 16, 2026

లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

image

స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 234 పాయింట్లు పెరిగి 83,619 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 25,712 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో ఇన్ఫీ, టెక్ మహీంద్రా, M&M, అదానీ పోర్ట్స్, ట్రెంట్ షేర్లు లాభాల్లో.. ఎటర్నల్, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.313 వద్ద ప్రారంభమైంది.

News January 16, 2026

కృష్ణా: ORR అభ్యంతరాలకు నేడే లాస్ట్ డేట్.. రైతుల్లో ఉత్కంఠ!

image

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ అభ్యంతరాల గడువు ఈ నెల 16వ తేదీతో ముగియనుంది. కృష్ణా జిల్లాలోని పామర్రు, పెనమలూరు, గన్నవరం పరిధిలో 189.4 కి.మీ మేర 6 వరుసల రహదారి కోసం కేంద్రం గెజిట్ విడుదల చేసింది. రూ. 16,310 కోట్ల భారీ వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుపై రైతులు తమ అభ్యంతరాలను తెలిపేందుకు నేడే ఆఖరి అవకాశం.

News January 16, 2026

నేడు ఆవులను ఎలా పూజించాలంటే?

image

కనుమ రోజున ఆవులను, ఎడ్లను చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చు.