News December 4, 2024
శ్రీ సత్యసాయి: విషాదం.. ఇంటి పైకప్పు కూలి ఇద్దరి మృతి
చిలమత్తూరు మండలం శెట్టిపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇంటి పైకప్పు కూలి ఇద్దరు మృతిచెందారు. బుధవారం సాయంత్రం స్లాబ్ నిమిత్తం అమర్చిన కట్టెలను తొలగిస్తుండగా ఇల్లు కుప్పకూలింది. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, శివారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరొకరు చికిత్స పొందుతున్నారు. కాగా, అనంతపురం జిల్లా కందుర్పిలో మిద్దె కూలి <<14784951>>ముగ్గురు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే.
Similar News
News January 25, 2025
వైసీపీ నుంచి ఇద్దరు కళ్యాణదుర్గం నేతల సస్పెండ్
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇద్దరు నేతలను వైసీపీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో కళ్యాణదుర్గం మున్సిపల్ వైస్ ఛైర్మన్ జయం ఫణీంద్ర, బ్రహ్మసముద్రం జడ్పీటీసీ ప్రభావతమ్మను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఇటీవల జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే సురేంద్రబాబుకు వైస్ ఛైర్మన్ జయం ఫణీంద్ర సన్మానం చేసినట్లు తెలుస్తోంది.
News January 25, 2025
9 మంది ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి
అనంతపురం జిల్లాకు చెందిన 9 మంది ఏఎస్సైలు ఎస్సైలుగా పదోన్నతులు పొందారు. ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన ఎస్సైలు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పదోన్నతులు రావడం అభినందనీయమని, మిగిలిన సర్వీసును కూడా రిమార్కు లేకుండా పూర్తి చేయాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో మరిన్న పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు. కాగా వీరందరూ 1991 బ్యాచ్‌కు చెందిన వారు.
News January 25, 2025
అనంతపురం జిల్లాలో మేనమామపై కత్తితో అల్లుడి దాడి
అనంతపురం జిల్లా సెట్టూరు మండలం కైరేవు గ్రామంలో శుక్రవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. మేనమామ ఆంజనేయులుపై అల్లుడు రంగస్వామి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఇంట్లో కూర్చుని ఉన్న మేనమామ ఆంజనేయులుపై అల్లుడు రంగస్వామి కత్తితో తలపై దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆంజనేయులును కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు.