News April 10, 2025
శ్రీ సీతారాముల కళ్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పణ

ఒంటిమిట్టలో శుక్రవారం జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పించారు. మొత్తం 120 కిలోల బరువైన ఈ తలంబ్రాలను ఆలయం వద్ద సూపరింటెండెంట్ హనుమంతయ్య, అర్చకులు శ్రావణ్ కుమార్ సమక్షంలో అందించారు.
Similar News
News January 20, 2026
KNR: ‘పే స్కేల్ బకాయిలను వెంటనే చెల్లించాలి’

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ బస్టాండ్ ఆవరణలోని ఆర్ఎం కార్యాలయం ఎదుట ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు నిరసన తెలిపారు. 2017 పే స్కేల్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఎస్ఆర్‌బీఎస్ లైఫ్ సర్టిఫికెట్‌ను వెంటనే ఆన్ లైన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
News January 20, 2026
మల్లె మొగ్గలను తొలిచే పురుగుల నివారణ ఎలా?

మల్లె తోటల్లో మొగ్గలను తొలిచి తినే పురుగు వల్ల పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది. దీని నివారణకు 5 శాతం వేప కాషాయం లేదా థయోక్లోప్రిడ్ 21.7% S.C. 1ml లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 18.5% S.C 0.3ml లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 0.3మి.లీ. లేదా క్వినాల్ ఫాస్ 25% ఇ.సి. 2మి.లీ.లలో ఏదైనా ఒకదానిని లీటరు నీటికి కలుపుకొని మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఎకరానికి 6 నుంచి 8 చొప్పున లింగాకర్షణ బుట్టలు అమర్చాలి.
News January 20, 2026
₹15 లక్షల భరణం అడిగిన భార్య.. భర్త ఏం చేశాడంటే..

భార్య ₹15 లక్షల భరణం అడిగిందని ఉద్యోగానికి రిజైన్ చేశాడో భర్త. కెనడాకు చెందిన దంపతులు సింగపూర్‌లో ఉంటున్నారు. 2023లో అతడు భార్యతో విడిపోయాడు. తనకు, పిల్లల(4)కు కలిపి నెలకు S$20వేలు(₹15L) భరణం ఇవ్వాలని ఆమె అడగడంతో జాబ్ మానేశాడు. 2023లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా అతడి వార్షిక జీతం S$8.6 లక్షలు(₹6Cr). ఈ క్రమంలో ఆమెకు S$6.34 లక్షలు(₹4.47Cr) చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు తాజాగా ఆదేశాలిచ్చింది.


