News April 13, 2024
షర్మిలపై చర్యలు తీసుకోండి: మేయర్ సురేశ్

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు మేయర్ సురేశ్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ తరఫున ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో జరిగిన బస్సు యాత్రలో షర్మిల ముఖ్యమంత్రి జగన్, కడప ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డిపై నోటికి వచ్చినట్లు మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు.
Similar News
News December 8, 2025
కడప జిల్లాలో e-Shramలో నమోదు చేసుకున్న 3.80 లక్షల మంది

కడప జిల్లాకు చెందిన 3.80 లక్షల మంది శ్రామికులు తమ పేర్లను కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన e-Shram పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. 42.76% పురుషులు, 57.23% మహిళలు నమోదు చేసుకున్నారు. 18-40 వయస్సు వారు 45.2%, 40-50 వయస్సు వారు 30.27%, 50+ వయస్సు వారు 24.47% మంది చేసుకున్నారు. అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ, వ్యవసాయ, ఇతర రంగాల్లోని కార్మికులు ప్రభుత్వ పథకాల కోసం నమోదు చేసుకున్నారు.
News December 8, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరలు:

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు:
☞ బంగారం 24 క్యారెట్ ఒక గ్రాము ధర: రూ.12775
☞ బంగారం 22 క్యారెట్ ఒక గ్రాము ధర: రూ.11753
☞వెండి 10 గ్రాముల ధర: రూ.1780
News December 8, 2025
కడపకు చేరుకున్న రాష్ట్ర హోంమంత్రి అనిత

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కడపకు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆమెకు SP నచికేత్ విశ్వనాథ్ స్వాగతం పలికారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆమె జిల్లాకు వచ్చినట్లు సమాచారం.


