News May 4, 2024
షాద్‌నగర్‌లో యాక్సిడెంట్.. యువకుడి మృతి

షాద్‌నగర్ పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. కిషన్ నగర్ గ్రామానికి చెందిన వికాస్ రెడ్డి పట్టణంలోని హాజిపల్లి రోడ్డులో బైక్ పై వెళ్తుండగా అదుపుతప్పి కింద పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని పరిశీలించారు. రోడ్డుపై ఇసుక పేరుకుపోవడంతో బైక్ స్కిడ్ అయి అతడు కింద పడినట్లు తెలుస్తోంది.
Similar News
News December 9, 2025
MBNR: స్వామివారి తలనీలాలకు కోటి రూపాయల టెండర్

తెలంగాణ తిరుపతిగా పేరు ప్రఖ్యాతలుగాంచిన మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం టెండర్లు నిర్వహించారు. పది సంవత్సరాల క్రితం పలికిన విధంగా ఈసారి కూడా కోటి రూపాయలు తలనీలాలకు రెండేళ్ల కాలపరిమితికి ఐదుగురు వ్యాపారులు పాల్గొన్నారు. శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ వారికి దక్కిందని ఆలయ ఈవో శ్రీనివాసరాజు తెలిపారు.
News December 9, 2025
MBNR: ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరుకావాలి: కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు కేటాయించిన పి.ఓలు, ఓ.పి.ఓలు ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ విజయేందిర బోయి ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై ఎన్నికల నిబంధనల అనుసరించి క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు.
News December 9, 2025
MBNR: ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ: ఎస్పీ

ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలా జరగాలని, శాంతిభద్రతల కోసం ప్రతి ఒక్కరూ నియమాలు పాటించాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డీ.జానకి అన్నారు. ఓటును కొనడం లేదా అమ్మడం చట్టపరంగా పెద్ద నేరం అని ఆమె హెచ్చరించారు. అటువంటి ప్రయత్నాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రివేళల్లో గుంపులుగా తిరగడం, మద్యం సేవించి గొడవలకు పాల్పడడం పూర్తిగా నిషేధం అని ఎస్పీ స్పష్టం చేశారు.


