News March 8, 2025
షి బాక్స్ ప్రారంభించిన శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, షి బాక్స్‌ను జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. శనివారం సెలవు దినం కావడంతో శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ చేతుల మీదుగా షీ బాక్స్‌ను ప్రారంభించి, కార్యాలయంలో ఏర్పాటు చేశారు.
Similar News
News March 23, 2025
ఎన్నికల్లో కపట హామీలు.. గెలిచాక ఊసే ఉండదు: వైసీపీ

AP: చంద్రబాబు 40 ఏళ్లుగా మోసపూరిత రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారని YCP విమర్శించింది. ఎన్నికల్లో కపట హామీలు ఇచ్చి గెలిచాక వాటి ఊసే ఎత్తని సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపింది. వాలంటీర్లు, ఏపీ అప్పు, సూపర్ 6, భృతి, ఉచిత బస్సు, పోలవరం విషయంలో మోసం చేశారని ఆరోపించింది. ఇప్పటికే మండలిలో ప్రభుత్వాన్ని YCP ప్రశ్నిస్తోందని, శాసనసభలోనూ ప్రతిపక్ష హోదా ఇస్తే మరింత నిలదీస్తారని CBN భయపడుతున్నారని పేర్కొంది.
News March 23, 2025
IPL చరిత్రలో ఆర్చర్ చెత్త రికార్డ్

IPL-2025లో RR బౌలర్ జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఇవాళ ఉప్పల్‌లో SRHతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 76 పరుగులు ఇచ్చారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఓ స్పెల్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మారారు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో తీక్షణ(52), సందీప్ శర్మ(51) ధారాళంగా పరుగులు ఇచ్చారు. అలాగే ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు(46) నమోదైన మ్యాచ్‌గానూ రికార్డ్ సృష్టించింది.
News March 23, 2025
హెచ్చరిక: అలా చేస్తే ఇక లైసెన్స్ రద్దు?

TG: తరచూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారులకు షాక్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వాటిని మళ్లీ పునరుద్ధరించకపోవడమే కాక వారి వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా చేయబోమని పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ నిబంధనను అమలుచేయనున్నట్లు తెలుస్తోంది.