News August 22, 2025
షెడ్యూల్ కులాల యువకులకు హెవీ డ్రైవింగ్ పై శిక్షణ: ముక్కంటి

షెడ్యూల్ కులాలకు చెందిన యువతకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌పై శిక్షణ ఇస్తున్నామని ఎస్సీ ఈడీ ముక్కంటి గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈనెల 27 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. శిక్షణ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభిస్తామన్నారు. ఎస్సీ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని, పూర్తి చేసి అక్కడే సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు నం: 8019684966 సంప్రదించాలన్నారు.
Similar News
News January 21, 2026
రాష్ట్రంలో మరో 6 అర్బన్ ఫారెస్ట్‌లు

తెలంగాణలో మరో 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ‘నగర్ వన్ యోజన’ కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా రూ.8.26 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మావల, యాపల్ గూడ-II, మంచిర్యాల జిల్లా ఇందారం, చెన్నూర్, మేడ్చల్ జిల్లా యెల్లంపేట, చెంగిచెర్లలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్కుల ఏర్పాటు జరుగుతుంది.
News January 21, 2026
VJA: మహిళ వేషం ధరించి చోరీ.. నిందితుడి అరెస్ట్

మహిళ వేషం ధరించి బంగారం చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.కండ్రికకు చెందిన ఓ వృద్ధురాలని అదే ప్రాంతానికి చెందిన జోసెఫ్ అనే వ్యక్తి మహిళ వస్త్రాలు ధరించి బంగారం సోమవారం చోరీ చేశాడు. ఈ ఘటనపై సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గంటల వ్యవధిలో అరెస్ట్ చేసినట్లు నున్న సీఐ కృష్ణమోహన్ తెలిపారు. అతని వద్ద నుంచి బంగారం లాకెట్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
News January 21, 2026
జనవరి 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’

AP: పర్యాటక శాఖ JAN 24-FEB 1 వరకు ‘విశాఖ ఉత్సవం’ నిర్వహించనుంది. ‘సీ టు స్కై’ కాన్సెప్ట్‌తో విశాఖ, అనకాపల్లి, అరకు లోయలో 9 రోజులపాటు ఉత్సవం జరగనుంది. విశాఖలో JAN 24-31 వరకు, JAN 29, 30 అనకాపల్లిలో, JAN 30-FEB 1 వరకు అరకు లోయలో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనిలో 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 3000 మందికి ప్రత్యక్ష, 1800 మంది సహాయకులకు ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు.


