News April 24, 2025
షేక్ హిష్రత్.. నంద్యాల జిల్లా టాపర్

టెన్త్ పరీక్షల్లో విద్యార్థులు మార్కుల సునామీని సృష్టించారు. కాకినాడకు చెందిన నేహాంజనికి 600కు 600 మార్కులు రాగా రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు 599 మార్కులు సాధించారు. వారిలో నంద్యాలకు చెందిన షేక్ హిష్రత్ కూడా ఉన్నారు. డెంటల్ డాక్టర్ మహ్మద్ రఫీ, ఫిర్దోస్‌బాను దంపతుల కుమార్తె హిష్రత్ నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివి 599 మార్కులతో సత్తా చాటారు. నంద్యాల జిల్లా టాపర్‌గా నిలిచారు.
Similar News
News March 10, 2026
ANU: ప్రవేశ పరీక్షా షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో MBA, MCA ఉమ్మడి ప్రవేశ పరీక్షా షెడ్యూల్‌ను మంగళవారం కో ఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ విడుదల చేశారు. ఈ నెల 15న రాష్ట్రంలోని 12 పరీక్ష కేంద్రాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు వర్సిటీ వెబ్సైట్ www.anucde.info నుంచి హాల్ టికెట్లను పొందవచ్చన్నారు.
News March 10, 2026
BREAKING: 13న అకౌంట్లలో డబ్బులు జమ

రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం నిధుల విడుదల డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 13న 22వ విడత డబ్బులు జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఈ డబ్బులు రిలీజ్ చేస్తారు. కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. దీని ద్వారా సుమారు 10 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు.
News March 10, 2026
ప్రజలపై భారం.. మీ విద్యుత్ కొనం: NTPCకి రాష్ట్రం లేఖ

TG: బయట చౌకగా దొరుకుతున్నా ఒప్పందం పేరిట ఎక్కువ ధర ఉన్న NTPC విద్యుత్తును కొనేది లేదని రాష్ట్రం ఆ సంస్థకు లేఖ రాసింది. తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తు చేసింది. అటు సంస్థ నిర్మిస్తున్న 2400MW ప్రాజెక్టుకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయలేమని తేల్చి చెప్పింది. నిల్వలు ఉంటే సరఫరాపై పరిశీలిస్తామంది. ప్రజలపై భారం పడకుండా తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వాలని స్పష్టం చేసింది.


